తెలంగాణ రాష్ట్రంలో భూ విలువలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టీజీఐఐసీ (TGIIC) నిర్వహించిన భూ వేలంలో రాయదుర్గం నాలెడ్జ్ (Raidurgam Knowledge City ) సిటీలోని స్థలం రికార్డు స్థాయిలో అమ్ముడైంది. ఒక్క ఎకరం భూమి ఏకంగా రూ.177 కోట్లు పలకడం ఈ వేలానికి ప్రత్యేకతను తీసుకువచ్చింది. హైదరాబాద్ ఐటీ హబ్ పరిసరాల్లో ఈ ధర ఇప్పటివరకు నమోదు కాని అత్యధిక రేటుగా గుర్తింపు పొందింది.
Drone City : 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన – చంద్రబాబు
వేలంలో పాల్గొన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎంఎస్ఎన్ రియాలిటీ (MSN Reality) ఈ ప్రభుత్వ భూమిని రికార్డు ధరకు సొంతం చేసుకుంది. మొత్తం 7.6 ఎకరాల భూమి కోసం సంస్థ రూ.1,357 కోట్లు చెల్లించింది. హైదరాబాద్ సైబర్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఐటీ, కమర్షియల్ కార్యకలాపాలు వేగంగా అభివృద్ధి చెందడం ఈ ధరకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్రంలో భూవిలువల పెరుగుదల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలాన్ని, రియల్ ఎస్టేట్ రంగ చురుకుదనాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ లావాదేవీతో ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం లభించడం మాత్రమే కాకుండా, రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ప్రాజెక్ట్‌కి కూడా మరింత ప్రాధాన్యం లభించింది. ఇంత భారీ ధరకు భూమి అమ్ముడవడం భవిష్యత్తులో ఇలాంటి వేలాలపై పెట్టుబడిదారుల్లో ఆసక్తిని పెంచే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/