తెలంగాణ రైతాంగానికి అవసరమైన యూరియా సరఫరా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. ఇది తెలంగాణపై వివక్షతకు స్పష్టమైన ఉదాహరణ అని ఆయన తీవ్రంగా విమర్శించారు.

లేఖలు, విజ్ఞప్తులకు స్పందన లేనిదే
రాష్ట్రానికి కావాల్సిన యూరియాను పంపించమని పునరావృతంగా లేఖలు, విజ్ఞప్తులు చేసినా కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అవసరాలను పట్టించుకోకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తున్న కేంద్ర విధానాన్ని ఆయన ఖండించారు.
పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీల గళం
కేంద్రం వైఖరిని ఎండగట్టడంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో గట్టిగా మాట్లాడారని సిఎం ప్రశంసించారు. ముఖ్యంగా రైతుల సమస్యలపై ధైర్యంగా నిలిచి, తెలంగాణకు న్యాయం చేయాలని బలంగా అడిగిన ప్రియాంక గాంధీకి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ‘ఎక్స్’ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర మంత్రులపై విమర్శలు
తెలంగాణ నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్‌లపై కూడా సిఎం ధ్వజమెత్తారు. రాష్ట్ర రైతుల పక్షాన నిలవాల్సిన వారు తమ బాధ్యతను మరిచి కేవలం మోదీ ప్రసంసలకే పరిమితమయ్యారని ఆయన దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ ఎంపీల మౌనం
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో బలంగా పోరాడాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం మౌనం వహిస్తున్నారని సిఎం ఎద్దేవా చేశారు. “గల్లీల్లో గొడవలకు సిద్ధమయ్యే వారు, మోదీ ముందు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నారు? ఆయనంటే భయమా లేక భక్తా?” అని రేవంత్ ప్రశ్నించారు.
రైతుల కోసం బలమైన పోరాటం అవసరం
రైతుల సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాల్సిన సమయంలో, ప్రతిపక్షాలు కూడా సరైన ఒత్తిడి తేవడం లేదని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల కోసం ప్రభుత్వం గట్టి పోరాటం కొనసాగిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: