తెలంగాణలో మహిళా సాధికారతపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం కల్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. రాంజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన “వన మహోత్సవం” (Vana Mahotsavam) కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్, మహిళా రిజర్వేషన్‌ను తెలంగాణలో ముందుగానే అమలు చేసే దిశగా పూనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో 60 మహిళా ఎమ్మెల్యేలు?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు టికెట్లపై సీఎం రేవంత్ (Revanth Reddy) కీలకవ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతోంది వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమెల్యే సీట్లు ఇచ్చేబాధ్యత నేను తీసుకుంటానని భరోసా ఇచ్చారు
నారీశక్తి వందన్ బిల్లుపై స్పందన
మహిళా రిజర్వేషన్ల లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు (33 percent reservations) కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీశక్తి వందన్ అధినియమ్’బిల్లును గతంలోనే పార్లమెంటులో ఆమోదం పొందింది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే 2029 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ముమ్మాటికీ తమదేనని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. ప్రస్తుత లోక్‌సభలో 82 మంది మహిళలున్నారు. రిజర్వేషన్ల చట్టంతో ఈ సంఖ్య 181కి చేరే అవకాశం ఉంది. లోక్‌సభలో, శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఈ సీట్లను భర్తీ చేస్తారు. రాజ్యసభలో, రాష్ట్రాల శాసన మండలిలో ఈ రిజర్వేషన్లు వర్తించవు.
కోట్ల మంది మహిళలకు ఆర్థిక శక్తి
ఈ సందర్భంగా సీఎం మరో కీలక హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని రేవంత్ పునరుద్ఘాటించారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళా సాధికారత
రాంజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణకు పచ్చని చీరను కప్పేందుకు మనందరం కృషి చేయాలి” అని సీఎం పిలుపునిచ్చారు. వ్యవసాయ వర్సిటీలో ఆయన మొక్కలు నాటారు. బొటానికల్ గార్డెన్స్‌లో రుద్రాక్ష మొక్క నాటారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం తిలకించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: TG Police: గంజాయి నిర్మూలనకు పోలీసుల సరికొత్త వ్యూహం