हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Revanth Reddy: ప్రతి మహిళా సంఘానికి ఒక్కో బస్సు

Sushmitha
Telugu News: Revanth Reddy: ప్రతి మహిళా సంఘానికి ఒక్కో బస్సు

హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా తొలి అడుగు వేసిన ప్రజా ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి వినూత్న కార్యక్రమాలు ప్రారంభించింది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తోంది. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిన మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబన కోసం, సెర్ప్ ద్వారా దేశంలోనే మొదటిసారిగా 600 బస్సులు కొనుగోలు చేసి టీజీఆర్టీసీకి (TGRTC) అద్దెకిచ్చేలా పథకాన్ని రూపొందించింది.

Read Also: Bihar Results: ప్రతిపక్ష నేతగా తేజస్వీ తిరస్కరణ.. బుజ్జగించిన లాలూ ప్రసాద్

Revanth Reddy
Revanth Reddy: One bus for each women’s association

పథకం వివరాలు, నిధుల కేటాయింపు

ఈ పథకం అమలుకు టీజీఆర్టీసీ, సెర్ప్ మధ్య ఒప్పందం కుదిరింది. మహిళా సంఘాలు తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీని అందిస్తుంది.

  • మొదటి దశ: సెర్ప్ గుర్తించిన 17 జిల్లాలలోని 151 మండల మహిళా సమాఖ్యలకు ఒక్కొక్కటి చొప్పున 151 బస్సులు కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించింది.
  • రెండవ దశ: మరో 449 బస్సులను కొనుగోలు చేస్తారు.
  • ఖర్చు: ఒక్కో బస్సుకు ₹36 లక్షల వ్యయం కాగా, అందులో ₹6 లక్షలు మండల మహిళా సమాఖ్య సొంత నిధులను ఖర్చు చేస్తుంది. మిగతా ₹30 లక్షలను కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌గా ప్రభుత్వం అందించింది.

ఆదాయం, మహిళల భావాలు

టీజీఆర్టీసీ ప్రతి బస్సుకు నెలకు ₹69,648 అద్దెను చెల్లిస్తుంది. ఇందులో ₹19,648 ఆపరేషన్ ఖర్చులకు పోగా, మిగతా ₹50 వేలు రుణ వాయిదాగా చెల్లిస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రతి మహిళా సంఘానికి ఒక్కో బస్సు) చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకంతో మహిళా సంఘాలు లాభాలు గడిస్తున్నాయి. టీజీఆర్టీసీ ఇప్పటివరకు 151 మహిళా సమాఖ్యలకు ₹5 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ‘ఇందిరా మహిళా శక్తి మండల సమైక్య’ పేరు బస్సులపై చూసినప్పుడు ‘మా బస్సు, మేము ఓనర్లము’ అనే భావం చాలా గౌరవంగా అనిపిస్తుందని ములుగు జిల్లా, ఏటూరునాగారం మండల సమాఖ్య అధ్యక్షురాలు పి. పద్మ కృతజ్ఞతలు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870