हिन्दी | Epaper
రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు

Telugu News: Revanth Reddy: తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం

Sushmitha
Telugu News: Revanth Reddy: తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం

హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన విజయవంతం కావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా “తెలంగాణ అంటే క్రీడలు, తెలంగాణ అంటే శ్రేష్టత, తెలంగాణ అంటే ఆతిథ్యం” అని ప్రపంచానికి చాటి చెప్పామని ఆయన అన్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ నగరానికి విచ్చేసి క్రీడాభిమానులను, ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచిన ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, (Lionel Messi) లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ఈ కార్యక్రమానికి హాజరై, శనివారం సాయంత్రాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Also: Revanth Reddy: రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

Revanth Reddy
Revanth Reddy Let’s show the power of Telangana to the world

కార్యక్రమ విజయానికి సహకరించిన వారికి అభినందనలు

ఈ మెగా ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమించిన నగరంలోని అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. వచ్చిన అతిథులకు అత్యుత్తమ ఆతిథ్యం అందించడంలో క్రమశిక్షణతో వ్యవహరించిన క్రీడాభిమానులకు, ప్రజలకు కూడా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ సత్తాను ప్రపంచానికి చూపించేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

నిర్మాత నాగవంశీ ప్రశంసలు: సీఎం దార్శనికత వల్లే సాధ్యం

టాలీవుడ్ యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిసిన ‘ది గోట్ మెస్సీ టూర్ ఇండియా 2025′ కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతటి భారీ అంతర్జాతీయ ఈవెంట్‌ను ఎలాంటి గందరగోళం లేకుండా, ఎంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత మరియు నాయకత్వ పటిమ ఉన్నాయని ఆయన కొనియాడారు. నాగవంశీ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, “మెస్సీ టూర్ ఆద్యంతం ఎంతో సజావుగా సాగింది. ఒక అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించడం గర్వంగా ఉంది. తెలంగాణ రైజింగ్ అనే మాట ఈ రోజు నిజమైందనిపిస్తోంది” అని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ఒక ముఖ్యమైన చర్చనీయాంశంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870