తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించింది. (Revanth Reddy) తాజాగా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో (Telangana Rising Global Summit) భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో ఈ ప్రాజెక్టు ద్వారా నిరుద్యోగులకు కూడా శుభవార్త చెప్పింది.
Read Also: HYD: తెలంగాణ రైజింగ్ 2047

భారత్ ఫ్యూచర్ సిటీ: లక్ష్యం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ
3 ట్రిలియన్ డాలర్ల తెలంగాణ ఎకానమీని సాధించే లక్ష్యంతో భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలను మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వెల్లడించారు. ఈ నగరం 13,500 ఎకరాలలో అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో, అద్భుతమైన మౌలిక సదుపాయాలతో, జీరో కార్బన్ సిటీగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు.
ఈ ఫ్యూచర్ సిటీ ఆరు అర్బన్ జిల్లాలుగా అభివృద్ధి చెందుతుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అవి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, క్రీడలు, డేటా సెంటర్‌లు, అంతర్జాతీయ ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రత్యేకంగా నెలకొల్పనున్నట్టు వివరించారు.
13 లక్షల ఉద్యోగాలు, స్కిల్ యూనివర్సిటీ భరోసా
ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ద్వారా మొత్తం 13 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. దాదాపు తొమ్మిది లక్షల మంది జనాభా కోసం నివాస గృహ సముదాయాలను కూడా నిర్మిస్తామని, వీటిని నిర్మాణ రంగ నిపుణులు అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఈ నిర్మాణాలు ఎంతో మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు.
ఈ వార్త ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీపి కబురుగా మారింది. మరో నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయని ఇటీవల ప్రకటించడం కూడా యువతకు సంతోషాన్ని కలిగించింది. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదం చేస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: