తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో సమస్యలు ఎదురైతే ఇకపై గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు. 108 అంబులెన్స్ తరహాలోనే “విద్యుత్ అంబులెన్స్” సేవలను ప్రభుత్వం ప్రారంభించిందని వెల్లడించారు. రైతులు కరెంట్ సమస్యలు ఎదురైతే వెంటనే 1912 నెంబర్‌కు కాల్ చేస్తే చాలు, సమస్యను తక్షణమే పరిష్కరించేలా ప్రత్యేక వాహనాలు రంగంలోకి దిగుతాయని చెప్పారు.
Read also: TG: పేదలకూ కార్పొరేట్ వైద్యసేవలు

Special vehicles similar to ambulances.
విద్యుత్ అంబులెన్స్‌లతో యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం
విద్యుత్ అంబులెన్స్‌లలో మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, థర్మల్ విజన్ కెమెరాలు, సేఫ్టీ గేర్ బాక్సులు వంటి ఆధునిక పరికరాలు ఉంటాయని భట్టి విక్రమార్క వివరించారు. ప్రతి వాహనంలో ఒక ఇంజినీర్‌తో పాటు ఇద్దరు సిబ్బంది ఉంటారని, రైతులు ఫిర్యాదు చేసిన ప్రాంతానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతారని తెలిపారు. అలాగే అధికారులు వారానికి మూడు రోజులు పొలాల్లో ప్రజాబాట కార్యక్రమాలు నిర్వహించి రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
అదనపు కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సోలార్ ప్రణాళిక
గత రెండు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల అదనపు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి రైతుకు కనెక్షన్లు అందిస్తున్నామని స్పష్టం చేశారు. మరో 9,700 మంది రైతులకు లైన్ పనులు పూర్తయ్యాక వెంటనే ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేస్తామని చెప్పారు. అవసరమైన చోట మాత్రమే అదనపు లోడ్‌కు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే పీఎం కుసుమ్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, కొన్ని గ్రామాలను మోడల్ సోలార్ ప్రాజెక్టుల కోసం ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: