हिन्दी | Epaper

News Telugu: Revanth Reddy: కేసీఆర్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదన్న సీఎం

Rajitha
News Telugu: Revanth Reddy: కేసీఆర్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదన్న సీఎం

Revanth Reddy: బీఆర్ఎస్ ఇప్పుడు చరిత్రలో కలిసిపోతున్న పార్టీగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి ఉన్న “వ్యాలిడిటీ పీరియడ్” ముగిసిపోయిందని, కేసీఆర్‌తోనే దాని రాజకీయ ప్రస్థానం కూడా ముగుస్తుందని స్పష్టం చేశారు. తాను రాజకీయ ప్రతిస్పందన కోణంలో కాకుండా వాస్తవ పరిస్థితులను చెప్పుతున్నానని ఆయన అన్నారు. ఒకప్పుడు ప్రభావం చూపిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కనుమరుగైనట్లే, బీఆర్ఎస్ కూడా అదే దారిలో వెళ్తుందని ఆయన అంచనా వేశారు. కేసీఆర్ ఇప్పుడు రాజకీయంగా పూర్తిగా వెనుకబడ్డారని, ఆయనను చూస్తే సానుభూతి కలుగుతోందని రేవంత్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా కేసీఆర్ ఒక్క మాట కూడా చెప్పకపోవడం దేనికి సంకేతమో ప్రజలు ఆలోచించాలన్నారు.

Read also: Harish Rao: ఆడబిడ్డ రాజకీయమేంటో చూపిస్తా: కవిత

Revanth Reddy

Revanth Reddy: కేసీఆర్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదన్న సీఎం

బీఆర్ఎస్ కారణంగానే బీజేపీ 8 సీట్లు గెలిచింది

Revanth Reddy: ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి సహకరించిందని రేవంత్ ఆరోపించారు. “ఆ పార్టీ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసింది. బీఆర్ఎస్ కారణంగానే బీజేపీ 8 సీట్లు గెలిచింది” అని అన్నారు. కవిత స్వయంగా బీజేపీతో విలీన ప్రక్రియ మొదలైందని చెప్పడం దీనికి సాక్ష్యమన్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధికి పునాది పడిందని రేవంత్ గుర్తుచేశారు. గోదావరి నీటిని హైదరాబాద్‌కు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని, ఐటీ, ఫార్మా రంగాల్లో అభివృద్ధికి కూడా అదే బాట వేసిందని చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలతో సంక్షేమం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

పతనం అంచున ప్రజారోగ్యం

పతనం అంచున ప్రజారోగ్యం

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

ఆరోగ్యానికి మంచిదంటున్న ఇప్పపూల సారా.. ఎమ్మెల్యే అనిరుధ్

ఆరోగ్యానికి మంచిదంటున్న ఇప్పపూల సారా.. ఎమ్మెల్యే అనిరుధ్

వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్

వాగ్దానాలు అమలు చేయకుండా మోసగించిన కెసిఆర్

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధికి చర్యలు

📢 For Advertisement Booking: 98481 12870