Registration : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు వేగంగా సమర్ధవంతమైన, పారదర్శకంగా సేవలందించేలా చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏప్రిల్ 10 నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తొలుత ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ నూతన విధానంతో 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్
హైదరాబాద్‌లోని ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్, పెద్దపల్లి జిల్లా రామగుండం, ఖమ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం (R.O), మేడ్చల్ (R.O), మహబూబ్ నగర్(R.O), జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్ మొత్తం 22 చోట్ల ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఈ నూతన విధానంతో 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందని అన్నారు.
దాదాపు 45 నిమిషాల నుంచి గంటవరకు సమయం
ప్రస్తుతం ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు దాదాపు 45 నిమిషాల నుంచి గంటవరకు సమయం పడుతోంది. ఆ సమయాన్ని మరింత తగ్గించేందుకు స్లాట్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రజలు నేరుగా “registration.telangana.gov.in” వెబ్-సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్ధేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెంటనే వెళ్లిపోవచ్చన్నారు.
Read Also: త్వరలోనే కాంగ్రెస్ సర్కార్ బడా స్కామ్ బయటపెడతా : కేటీఆర్