40 నెలలుగా భవన అద్దె బాకీ పక్షం రోజుల్లో పూర్తి అద్దె చెల్లించేలా చర్యలు తీసుకుంటానని సబ్ రిజిస్ట్రార్ హామీ
హైదరాబాద్ (అబ్దుల్లాపూర్మెట్) : ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి (Registrar Office) సంబంధించి 40 నెలల అద్దె చెల్లించడం లేదంటూ ఆ భవన యజమాని తాళాలు వేసిన సంఘటన అబ్దుల్లాపూర్ (Abdullahpur) మెట్ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, భవన యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్ మండలం కేంద్రంలోని ఓ ప్రైవేటు భవనంలో గత 17 సంవ త్సరాల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం (Registrar Office) కొనసాగుతోంది. అయితే గత 40 నెలలుగా ఈ కార్యాలయానికి సంబంధించిన అద్దెను చెల్లించకుండా (Without paying rent) భవన యజమాని అయిన పిట్టల రాజు ముదిరాజు అధికారులు ఇబ్బందులకు గురిచేస్తుండడంతో విసుగు చెందిన ఆయన సోమవారం ఉదయం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళాలు వేశారు. తనకు చెల్లించాల్సిన అద్దె డబ్బులు పూర్తిగా చెల్లించిన తర్వాతే కార్యా లయ తాళాలు తీస్తానని భీష్మించుకు కూర్చు న్నాడు. బ్యాంకు రుణం తీసుకుని ఈ భవనాన్ని నిర్మించానని, ప్రతి నెల అద్దె సక్రమంగా వస్తే ఈఎంఐ చెల్లించేందుకు అవకాశం వస్తుందని భావించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తన భవనాన్ని అద్దెకు ఇస్తే ప్రతి సారి అద్దె చెల్లించే వి షయంలో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని భవన యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయ పనివేళల్లో సుమారు గంటన్నర పాటు కార్యాలయానికి తాళం వేయడంతో ఇటు అధికారులు, అటు ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలకు కొంతమేర ఇబ్బందులు ఎదురైంది. దీంతో స్పందించిన స్థానిక సబ్జిస్ట్రార్ సునితా రాణి వచ్చే 15 రోజుల్లో పూర్తి అద్దె డబ్బులు వచ్చేలా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీనివ్వడంతో భవన యజ మాని కార్యాలయ తాళాలు తీశారు. దీంతో అం దరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా సబ్ రిజి స్ట్రార్ కార్యాలయానికి తాళాలు వేశారన్న సమా చారం.
సబ్ రిజిస్ట్రార్ అంటే ఏమిటి?
సబ్ రిజిస్ట్రార్ అనేది ప్రభుత్వ అధికారి, ఆయన భూముల కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వంటి లావాదేవీలను చట్టబద్ధంగా నమోదు చేస్తాడు. ప్రజలకు భూ పత్రాలు, వైవాహిక రిజిస్ట్రేషన్లు వంటి సేవలు అందిస్తాడు.
అబ్దుల్లాపూర్మెట్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భవన యజమాని ఎందుకు తాళాలు వేశాడు?
గత 40 నెలలుగా అద్దె రుసుములు చెల్లించకపోవడంతో భవన యజమాని విసిగిపోయి తాళాలు వేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Suicide Attempt: పట్టా ఉన్న భూమి సొంతం కావడం లేదని కలెక్టరేట్ లో రైతు ఆత్మహత్యాయత్నం