హైదరాబాద్ : రాష్ట్రంలో అభివృద్ధికి చిహ్నంగా రియల్ ఎస్టేట్ (Real estate) ముందుకువెళ్తాందని, కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనను చాలా కీలకంగా ముందుకు తీసుకెళ్తాందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి రూ. లక్ష 80వేల కోట్ల చేస్తున్నామన్నారు. మన దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదివారం నేషనల్ రియల్ ఎస్టేట్ మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైటెక్స్ లో నిర్వహిస్తున్న 15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2047 లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి చెందిన దేశాల వరుసలో మన దేశం ఉండాలని పేర్కొన్నారు.
Guntakal Railway :డోన్-గుంటూరు రైలును గుంతకల్లు -విజయవాడ మధ్య నడపాలి

దేశంలో ప్రతి శాఖకు మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో అత్యధిక కల్పన చేస్తున్నామ న్నారు. ప్రపంచంలో 4వ ఆర్థిక ఎకనామిగా అభివృద్ధి చెందుతున్నామని, ప్రధాని నరేంద్ర మోడీ సంస్కరణలు లేకుండా అభివృద్ధి పనులు చేయమని పేర్కొంటున్నారని తెలిపారు. 331 లక్షల కోట్లకు మన దేశ జిడిపి పెరిగిందని, 20 మంది ప్రజలు దారిద్య్ర రేఖ నుంచి బయటకు వచ్చారని తెలిపారు. అవినీతి లేని పాలన మోడీ అందిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు తగ్గించారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్(Real estate) సెక్టార్లో రెరా యాక్ట్ మైల్ స్టోన్గా ఉపకరిస్తుందని, జిఎస్టి స్లాబ్ తగ్గడంతో రియల్ ఎస్టేట్కు బాగా లాభం జరిగిందని పేర్కొన్నారు.
2024-25లో రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవల రంగం 15.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. 11.97 శాతం వృద్ధి రేటుతో నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.80వేల కోట్లకు పైగా సమకూర్చింది. స్టేట్ సర్వీసెస్ జీఎస్ డీపీలో ఈ రెండు రంగాల వాటానే 24.9 శాతంగా ఉంది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో 2024 సెప్టెంబర్ లో రూ.2820 కోట్ల విలువైన 4903 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో రూ.4804 కోట్ల విలువైన 6612 ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఇది 35 శాతం అధికం. విలువలో వార్షిక వృద్ధి 70 శాతంగా నమోదయ్యింది. ఇవి కేవలం గణాంకాలు కాదు, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలయ్యిందంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్న వారికి ధీటైన సమాధానాలు అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఈ సెప్టెంబర్ లో రూ. కోటి పైన విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్లలో(property registrations) 151 శాతం పెరుగుదల ఉంది. మొత్తం విక్రయాల్లో విలువ పరంగా వీటి వాటానే 53 శాతం అని చెప్పారు. భారత్లో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. అయితే… అభివృద్ధి చెందిన దేశాల జీడీపీలో స్థిరాస్తి రంగ వాటా సగటున 10 శాతం 15 శాతం కాగా… చైనాలో అత్యధికంగా 23 శాతం నుంచి 25 శాతం వరకుంది. మన దేశంలో ఇది 6 శాతం నుంచి 8 శాతమే. ఇది మరింత పెరగాల్సిన అవసరముంద్ది అని అభిప్రాయపడ్డారు. ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో ఫేజ్ 2, భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్డు తదితర ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రూపురేఖలు మారిపోనున్నాయి. డిసెంబర్ నాటికి ఫ్యూచర్ సిటీలో జోనలైజేషన్ ప్రక్రియను పట్టలెక్కించాలనే పట్టుదలతో ఉన్నాం. అక్కడే 200 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్న ఏఐ సిటీకి రెండు, మూడు నెలల్లోనే భూమి పూజ చేయబోతున్నాం అని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: