Dharmannaguda Temple Land Issue: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూములు ఆక్రమణకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 98/2 లో ఉన్న మూడు ఎకరాల ఎండోమెంట్ భూమిని, భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీటీసీ గౌర మల్లేష్ తన సతీమణి గౌర వసంత పేరు మీద దొంగచాటుగా పట్టా చేసుకున్నారని ఆలయ పరిరక్షణ కమిటీ ఆరోపించింది.
Read Also: Journalists Accreditation Cards Telangana: వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలి
కలెక్టరేట్ వద్ద ఆందోళన
ఈ అక్రమ పట్టాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బండ మల్లేష్, మండల సత్యనారాయణ మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా ఈ భూమిని గౌర మల్లేష్ సాగు చేస్తున్నారని, ఇప్పుడు అధికార బలంతో దానిని తన సొంతం చేసుకున్నారని మండిపడ్డారు.
Dharmannaguda Temple Land Issue: సర్వే చేసి ఆలయానికి అప్పగించాలి
గ్రామ ప్రజలందరినీ మోసం చేస్తూ దేవుడి భూమిని పట్టా చేసుకోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సదరు భూమిని సర్వే చేయించాలని, అక్రమ పట్టాను రద్దు చేసి తిరిగి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పేరు మీదకు మార్చాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆలయ భూములను కాపాడుకోవడానికి గ్రామస్తులంతా ఐక్యంగా పోరాడుతామని వారు హెచ్చరించారు.
పాల్గొన్న కమిటీ సభ్యులు
ఈ కార్యక్రమంలో ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి, మండల నరసింహ, గోపాలకృష్ణ, జంగయ్య, కొంపోజు సురేష్ చారి, బుడిగలి మల్లేష్, బుర్రి వెంకటేష్, మండల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: