జీహెచ్‌ఎంసీ (GHMC) విస్తరణ వెనుక నిజమైన ఉద్దేశం ప్రజా ప్రయోజనం కాదని, ఇది కేవలం రాజకీయ స్వలాభం మరియు మజ్లిస్ పార్టీకి ప్రత్యేక ప్రయోజనం కల్పించడం కోసమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, 69 లక్షల ఓటర్లు ఉన్న జీహెచ్‌ఎంసీని అకస్మాత్తుగా కోటి 69 లక్షల జనాభా స్థాయికి తీసుకువచ్చి, హైదరాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద నగరంగా మార్చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తోందని విమర్శించారు.
Read Also: Ponnam Prabhakar: 2047 నాటికి ప్రజారవాణా 70 శాతానికి పెంపు
మౌలిక వసతుల లేమి, రైతు భూములపై అన్యాయం
ప్రస్తుత జీహెచ్‌ఎంసీలోని అనేక వార్డుల్లో రోడ్లు సరిగా లేవని, సీవరేజ్ సిస్టమ్ లేదని, మౌలిక వసతులు సరిగ్గా లేవని రామచందర్ రావు (Ramachandra Rao) పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకముందే, విస్తరణ పేరిట మరిన్ని ప్రాంతాలను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో (GO) జారీ చేయడం అన్యాయం అని అన్నారు. ఇంతటితో ఆగకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ల్యాండ్‌గా కన్వర్ట్ చేయాలనుకోవడం మరో పెద్ద అన్యాయమని ఆయన ఆరోపించారు. దీనిపై బీజేపీ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిపారు.

మజ్లిస్ ప్రయోజనాల కోసమే 300 వార్డుల పునర్విభజన
రామచందర్ రావు ప్రభుత్వంపై పలు డిమాండ్లు చేశారు. ప్రజల అభిప్రాయాలు వినాలని, దీనిపై హియరింగ్స్ నిర్వహించాలని, పబ్లిక్ డొమైన్‌లో పూర్తి వివరాలు ఉంచాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రతిపాదించిన 300 వార్డుల విభజనలో స్పష్టంగా రాజకీయ ప్రయోజనం దాగి ఉందని ఆరోపించారు. విస్తరణను మూడు భాగాలుగా చేస్తూ, ప్రత్యేకంగా మజ్లిస్ పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు వచ్చేలా లైనప్ చేస్తూ రాజకీయ ప్రయోజనం కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోందని ఆయన అన్నారు. హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, కీలక గ్రామ పంచాయతీలను జోడించి జీహెచ్‌ఎంసీని విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విస్తరణతో జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం దాదాపు 2,000 చదరపు కిలోమీటర్లకు పెరిగి, మొత్తం 300 వార్డులుగా పునర్విభజన జరుగుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: