Rajya Sabha MPs Retirement : తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దల సభకు వెళ్లిన పలువురు ఎంపీలు
ఈ ఏడాది రిటైర్ కానున్నారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు ఎంపీలు పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం ఈ సంవత్సరం రిటైర్ కాబోయే రాజ్యసభ సభ్యుల జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ఏప్రిల్ 9న రిటైర్ కానున్నారు.
Read also: Revanth Reddy: రావిర్యాల ఈ–సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ సభ్యుడు సానా సతీశ్కు జూన్లో రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది. శుక్రవారం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సభ్యుల రిటైర్మ్మెంట్ జాబితా(Retirement list) బులెటిన్ను రాజ్యసభ సెక్రటరీ జనరల్ కార్యాలయం విడుదల చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అనంతరం ఆ పార్టీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి లతోపాటు రియలయన్స్ సంస్థకు చెందిన పరిమిళ నత్వానీలను వైసీపీ కోటాలో రాజ్యసభకు పంపింది. అలాగే బీద మస్తాన్ రావును కూడా పంపింది. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం వారు టీడీపీలో చేరారు. దాంతో బీద మస్తాన్ రావుతోపాటు సానా సతీష్ ను రాజ్యసభకు టీడీపీ పంపింది.

కానీ సానా సతీష్ పదవి కాలం కొద్ది రోజుల్లోనే ముగియనుంది. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) నుంచి మరోకరిని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. అలాగే అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా ఆయన ఉన్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టులు, వివిధ సమస్యలపై ఆయన సుప్రీంకోర్టులో వాదిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై మను సంఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబై వెళ్లి మరీ చర్చించిన విషయం విదితమే. రాజ్యసభ నుంచి 2026లో మొత్తం 73 మంది రిటైర్ కానున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరీ, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ల పదవీ కాలం ముగుస్తుంది. పెద్దల సభలో ఖర్గే ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు మరోసారి అవకాశం దక్కవచ్చు.
మహారాష్ట్ర నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు, ఒడిశా నుంచి నలుగురు, పశ్చిమ బెంగాల్ నుంచి ఐదుగురు, అసోం నుంచి ముగ్గురు, బీహార్ నుంచి ఐదుగురు, ఛత్తీస్ గఢ్ నుంచి ఇద్దరు, హర్యానా నుంచి ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒకరు, గుజరాత్ నుంచి నలుగురు, ఝార్ఖండ్ నుంచి ఇద్దరు, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు, రాజస్థాన్ నుంచి ముగ్గురు, ఉత్తర ప్రదేశ్ నుంచి పదిమంది, కర్ణాటక నుంచి నలుగురు, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఒక్కరు చొప్పున రిటైర్ కానున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: