తెలంగాణ టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. రజనీకాంత్ (Rajinikanth) 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఒక్క వాణిజ్య ప్రకటనలో కూడా నటించకపోవడం ఆయన అసలైన గొప్పతనానికి నిదర్శనమని సజ్జనార్ (Sajjanar) తెలిపారు. “నిజమైన సూపర్ స్టార్” అనే బిరుదుకు రజనీగానే అర్హుడు అని కొనియాడారు.

డబ్బు కోసం సమాజానికి నష్టం కలిగిస్తున్న సెలబ్రిటీలు
ఈ సందర్భంగా సజ్జనార్, ప్రస్తుత కాలంలో కొందరు ప్రముఖుల ఆచరణపై ఆవేదన వ్యక్తం చేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ధోరణితో కొందరు కేవలం డబ్బు కోసం సమాజానికి హానికరమైన బెట్టింగ్ యాప్‌లను, మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి ప్రకటనలు అనేక మంది ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
రజనీ నిర్ణయం – స్ఫూర్తిదాయకం
ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ (Rajinikanth) తాను అభిమానించే వారిని మోసం చేయకూడదనే నిబద్ధతతో వాణిజ్య ప్రకటనలకు పూర్తిగా దూరంగా (Completely away commercials) ఉండటాన్ని సజ్జనార్ అత్యంత అభినందనీయ నిర్ణయంగా పేర్కొన్నారు. రజనీ యొక్క ఈ వైఖరి నేటి తరం సెలబ్రిటీలకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
సమాజ శ్రేయస్సు కోసం సెలబ్రిటీలు ముందుకు రావాలి
“డబ్బే ముఖ్యం, సమాజం ఏమైపోయినా పర్వాలేదు” అనే ధోరణి నుంచి బయటపడాలని, రజనీకాంత్‌లా ప్రజల శ్రేయస్సును కాపాడే దిశగా ప్రముఖులు ముందుకు రావాలని సజ్జనార్ సూచించారు. ప్రజల జీవితాలతో ఆటలాడే సంస్థల ప్రచారం నుండి పూర్తిగా దూరంగా ఉండాలని ఆయన హితవు పలికారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: