In-Service Teachers: ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్(Teacher Eligibility Test) నుంచి మినాయింపుని ఇవ్వాలని ఎస్టీయూ మెదక్ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్(Rajagopal Goud) తెలిపారు. బుధవారం నాడు నిర్వహించిన ఎస్టియు పెద్ద శంకరంపేట మండల కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇన్సర్విస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
Read also: BRS : ఉద్యమ పార్టీతో తెగిపోయిన కవిత బంధం..నెక్స్ట్ ఏంటి ?

అదేవిధంగా రాష్ట్రం(Telangana)లో ఉపాధ్యాయులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్లో ఉన్న డి ఏ లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నూతన పిఆర్సి ని తక్షణమే ప్రకటించి ఉపాధ్యాయులకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బి శ్రీనివాస్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా అదనపు కార్యదర్శి అశోక్ రెడ్డి, మండల అసోసియేట్ అధ్యక్షులు సిద్ధిరాములు, మండల అధ్యక్షులు రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఆర్థిక కార్యదర్శి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: