తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ వారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, నల్గొండ, (Nalgonda) సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం, సోమవారం కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మధ్యస్థాయి వర్షాలు కొనసాగుతాయని చెప్పారు.
Read also: Ditva Cyclone: శ్రీలంకలో ఉన్న ఏపీవాసులను తీసుకురావడానికి మంత్రి లోకేశ్ యత్నం

Heavy rain forecast for Telangana today
ప్రజలు భద్రంగా ఉండాలని
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు సంగారెడ్డి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, వికారాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 7.8 నుంచి 10 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య నమోదయ్యాయి. చలి తీవ్రత కారణంగా మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వేరులోని వ్యవసాయ కూలీ విఠల్ (45) మృతి చెందడం విషాదాన్ని కలిగించింది.
వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. వేడి దుస్తులు ధరించడం, ఉదయం మరియు సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లవద్దు, అత్యవసర పరిస్థితులు కాకుండా వర్ష సమయంలో బయటకు వెళ్లవద్దని సూచించారు. ప్రజలు భద్రంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులను సవితంగా గమనించాలని ఆదేశించారు.