Railway : ఖమ్మం జిల్లా రామకృష్ణాపురం 107 రైలు క్రాసింగ్ వద్ద బ్రిడ్జి నిర్మాణం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav) అన్నారు. ముఖ్యంగా రైతులు, తమ పొలాలకు వెళ్లాలన్నా, ఇతర పనుల కోసం వెళ్లాలన్నా తరచుగా రైల్వేగేట్లు మూసి ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇటీవల రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర లేఖ రాశారు. అయితే ఓవర్ బ్రిడ్జి (Overbridge) నిర్మాణనికై స్థానిక ప్రజలు, నాయకులు పలుమార్లు విన్నవించారని తెలిపారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :