తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకమైన గాత్రంతో అభిమానులను సంపాదించిన ప్రముఖ గాయకుడు, ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj),త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వివాహానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని తెలంగాణ ముఖ్యమంత్రి CM రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి ఆహ్వానించారు.
Read Also: Rahul Sipliganj: రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి ఫిక్స్!

సీఎంను కలిసిన రాహుల్, తమ పెళ్లి శుభలేఖను అందజేశారు
కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి నిన్న సీఎంను కలిసిన రాహుల్ (Rahul Sipligunj), తమ పెళ్లి శుభలేఖను అందజేశారు.ఈ నెల 27వ తేదీన రాహుల్, హరిణ్యల వివాహం జరగనుంది. వీరిద్దరి నిశ్చితార్థం గత ఆగస్టు నెలలో కుటుంబ సభ్యులు,
సన్నిహితుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. కాగా, రాహుల్ సిప్లిగంజ్ చేసుకోబోయే హరిణ్య రెడ్డి.. టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: