Quthbullapur suicide case : పరిధిలోని సాయిబాబా నగర్‌లో ఓ మహిళా ఫిజియోథెరపీస్ట్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన Suraram Police Station పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం, బత్తిని అనిత (29) అనే యువతి Mallareddy Hospital లో ఫిజియోథెరపీ డాక్టర్‌గా పనిచేస్తోంది. అవివాహితురాలైన అనిత సాధారణంగా ఉత్సాహంగా ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే శనివారం (ఫిబ్రవరి 7) ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
Read Also: India vs England U19 : రికార్డుల సునామీ సృష్టిస్తున్న భారత్

తెల్లవారుజామున ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: