Sarpanch elections: పోలీసు శాఖలో మూడు దశాబ్దాల పాటు అలుపెరుగని సేవలు అందించి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్సై స్థాయి కి ఎదిగారు. శాంతి భద్రతల పరి రక్షణలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు. పోలీస్ శాఖలో అధికారులతో సమన్వయంగా మెలుగుతూ అందరి ఆదరాభిమానాలను చూరగొంటూ విధులను నిర్వహించారు. రిజర్వేషన్ల(Reservations) పుణ్యమా అంటూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలిగింది. పదవీ విరమణకు సమయము దగ్గర పడినందున సర్పంచిగా గెలుపొంది మరో ఐదు సంవత్సరాల పాటు గ్రామ ప్రజలకు సేవ చేయాలని అనుకున్నారు.
Read Also: Sarpanch Rights : సర్పంచుల హక్కులకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ – KTR
పోలీస్ సేవల నుంచి రాజకీయ పోరాటం వరకు..
ఎస్సై పదవికి రాజీనామా చేసి సర్పంచ్ గా పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. ఎన్నికల రంగంలోకి దూకారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూశారు. గెలిచి ప్రజలకు మంచి సేవలు అందించడంతోపాటు గ్రామాభివృద్ధికి పాటుపడాలని అనుకున్నారు పులి వెంకటేశ్వర్లు(Puli venkateshwarlu). 33 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ గా పనిచేసి పదోన్నతిపై ఎస్సై అయ్యారు. ఆరు నెలల క్రితం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ కు ఎస్సైగా పులి వెంకటేశ్వర్లు వచ్చారు. స్వగ్రామం కోదాడ మండలం గుడిబండ.

దేవుడు వరమిచ్చాడు.. పూజారి వరం ఇవ్వలేదన్నట్టుగా మారిన ఎస్సై పరిస్థితి
ఈ క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో సర్పంచ్గా పోటీ చేయాలని అనుకున్నారు. 2026 ఏప్రిల్ లో పదవీ విరమణ పొందనున్న వెంకటేశ్వర్లు(Puli venkateshwarlu) ఎస్సై పదవికి రాజీనామా చేసి సర్పంచ్ గా పోటీ చేశారు. ముమ్మర ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆదరిస్తారని ఎంతో ఆశపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కూడా పులి వెంకటేశ్వర్లకు పూర్తి మద్దతు ఇచ్చింది. గెలుపొందాలని ఆశీర్వదించింది. కానీ దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఇవ్వలేదని చందంగా వెంకటేశ్వర్ల పరిస్థితి ఏర్పడింది.
గుడిబండ గ్రామంలో కాంగ్రెస్(Congress) రెండు వర్గాలుగా ఉండటంతో ఒక వర్గం వెంకటేశ్వర్లకు మద్దతు ప్రకటించకపోవడంతో కేవలం 10 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. గ్రామంలో సీనియర్ నాయకులు మద్దతు ఇచ్చిన రెబల్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాడు. కానీ పులి వెంకటేశ్వర్లు అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి. ఈ అంశం రాజకీయ పరిశీలకుల్లో చర్చనీయాంశమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: