హైదరాబాద్ Protest : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ (Government) స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్సు రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యుఎస్పిసి) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న హైదరాబాద్లోని ధర్నాచౌక్ మహాధర్నా చేపట్టనున్నట్టు యుఎస్పిసి నేతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను యుఎస్పిసి నేతలు సోమవారం టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో (TS UTF state office) ఆవిష్కరించారు. అనంతరం యుఎస్పిసి నేతలు మీడి యాతో మాట్లాడారు. చావ రవి, ఎ వెంకట్ (టిఎస్ యుటిఎఫ్), ఎన్ తిరుపతి (టిపి టిఎఫ్), ఎం సోమయ్య, టి లింగారెడ్డి (డిటిఎఫ్), కొమ్ము రమేష్ (బిటిఎఫ్), ఎస్ హరికిషన్ (టిటిఎ), పై విజయకుమార్ (ఎస్సీ ఎస్టీయుయస్), పి మాణిక్ రెడ్డి, ఎ సింహాచలం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. యుఎస్పిసి స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికి ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరిం చడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తుం దన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ఎన్నికల హామీలను అమలు పరచడం లేదన్నారు.
ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్న డిమాండ్
నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులను, ప్రతిరెవెన్యూ డివిజన్కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు యంఈఓ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ న్ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలన్నారు. ఉపాధ్యాయుల, పెన్షనర్ల వివిధ రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలకు 5571 పియస్ హెచ్యం పోస్టులను మంజూరు చేయాలని, డిఎడ్, బిఎడ్ అర్హతలున్న ప్రతియస్కీటికి పియస్ హెచ్యంగా ప్రమోషన్కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పండిట్, పిఈటిల అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయినందున జిఒ 2,3,9,10 లను రద్దుచేసి జిఒ 11,12ల ప్రకారం పదోన్నతులు కల్పిం చాలన్నారు. అలాగే ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని, వివిధ జిల్లాల్లో జరిగిన పైరవీ డిప్యూటేషన్లను వెంటనే రద్దు. చేయాలని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా
గురుకులాల టైం టేబుల్ను సవరించాలని, కెజిబివి, మోడల్ స్కూల్స్, గిరిజన సం క్షేమ, ఎయిడెడ్ టీచర్ల సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కా రానికి ప్రభుత్వానికి అనేక మార్లు ప్రాతినిధ్యం చేసినప్పటికి మంత్రులు, ఆఫీసర్ల కమిటీలు వేసినా సమస్యలు పరిష్కారం కాక పోవడంతో గత నెలలో దశలవారీ ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని యుఎస్ పిసి నిర్ణయించిందన్నారు.జులై 23, 24, 25 తేదీల్లో మండల తహసీల్దార్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెమోరాండాలు సమర్పించామని, రెండవ దశలో ఆగస్టు 5న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి జిల్లా కలెక్టర్ ద్వారా వినతిపత్రాలు అందజేశామని అయినా ప్రభుత్వం నుంచి స్పందనలేదన్నారు. ఈ నేపథ్యంలో అనివార్యంగా ఈ నెల23న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :