మంటల్లో ప్రైవేటు బస్సు..
– మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లే బోయిన్పల్లి వద్ద ఘటన
– ప్రయాణికులు సురక్షితం మహబూబ్నగర్ బ్యూరో,
ఫిబ్రవరి 24 : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని జాతీయ రహదారి 44పై మల్లె బోయిన్పల్లి వద్ద పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదవశాత్తు ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ బస్సు మల్లె బోయిన్పల్లి వద్దకు చేరుకోగానే బస్సుల్లో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు డ్రైవర్ అప్రమత్తమై బయటకు వచ్చారు. వెంటనే ప్రయాణికులు పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకొని మంటలు ఆర్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.