हिन्दी | Epaper
తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Telugu news: Ponnam Prabhakar: 2047 నాటికి ప్రజారవాణా 70 శాతానికి పెంపు

Tejaswini Y
Telugu news: Ponnam Prabhakar: 2047 నాటికి ప్రజారవాణా 70 శాతానికి పెంపు

Telangana Government: తెలంగాణ లో 2047 నాటికి ప్రజారవాణా వ్యవస్థను ప్రస్తుతం ఉన్న 28 శాతం నుంచి 70 శాతానికి పెంచుకోవడం లక్ష్యంగా నూతన రవాణా పాలసీ ఉంటుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం మహాలక్ష్మీ శ్రీ పథకం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బస్ భవన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 డిపోల్లో ఉన్న ఆర్టీసీ అధికారులతో రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు.

మహాలక్షీ పథకం విజయవంతానికి నిరంతరం శ్రమిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్ ఇతర సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: First phase of Telangana GP Polls-2025 : పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

హైదరాబాద్‌లో 373 కొత్త రూట్లు ప్రారంభం

ఆర్ టిసి(TSRTC)లో ప్రజారవాణ వ్యవస్థను విస్తృత పరచడానికి రాష్ట్ర రాజధానితోపాటు మారుమూల గ్రామాల వరకు కొత్త రూట్లను అన్వేషించడంతోపాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడిపించేలా కార్యాచరణ రూపొందించామని పొన్నం తెలిపారు. హైదరాబాద్ నగరంలో గత మూడు నెలలుగా సర్వే చేసి 373 కొత్త రూట్లలో బుధవారం నుంచి కొత్త బస్సులు నడుతుపుతున్నామని తెలిపారు. రింగ్ రోడ్డు వెలుపల ఉన్న దాదాపు 7 లక్షల మందికి కొత్తగా ప్రజా రవాణా సౌకర్యం ఏర్పడిందని వివరించారు. రూట్ల విస్తరణ చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు ఆర్టీసీ మూడింతల వ్యవస్థ అవసరమని అందుకు ఉద్యోగులు సిబ్బంది కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Ponnam Prabhakar
Ponnam Prabhakar: Public transport to be increased to 70 percent by 2047

తమకు సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం ప్రథమ కర్తవ్యమని ప్రయాణికుల విషయంలో ఆర్టీసీ సిబ్బంది స్నేహ పూర్వకంగా ఉండాలని సూచించారు. అటు అధికారులు సైతం ఆర్టీసీ సిబ్బంది విషయంలో కఠినంగా కాకుండా కుటుంబ సభ్యుల మాదిరి వ్యవహరించాలని అప్పుడే వారు సంస్థ కోసం మరింత పనిచేస్తారని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల మీద దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇటీవల సిరిసిల్ల లో జరిగిన ఘటనలో డ్రైవర్కి సంస్థ అండగా ఉందన్నారు. మీ ప్రతినిథిగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ప్రభు త్వంతో చర్చిస్తున్నానని ఆర్ధిక పరమైన అంశాలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

TSRTCలో 3038 కొత్త నియామకాలు

మహాలక్ష్మీ పథకం కారణంగా 90 డిపోలు లాభాల బాటలో ఉన్నాయని చెప్పారు. మిగిలిన డిపోలు కూడా లాభాల్లోకి వచ్చేలా పని చేయాలని ఆదేశించారు. గతంలో 2011 లో నియామకాలు జరిగితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 3038 పోస్టులకు డ్రైవర్, శ్రామిక్, సూపర్ వైజర్ పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయని, 2014 తరువాత మళ్ళీ తమ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో 2476 నూతన బస్సులు కొనుగోలు చేశామని తెలిపారు. అంటే ఇప్పుడున్న బస్సుల్లో 40 శాతం ఈ రెండు సంవత్సరాల కాలంలో వచ్చినవే అని, సంస్థ లో కారుణ్య నియామకాలు కింద బ్రెడ్ విన్నర్ స్కిం కింద 800 మెడికల్ అన్ ఫిట్ కింద 390 మంది మొత్తం 1190 మందిని నియమించామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నూతనంగా పెద్దపల్లి, ములుగు జిల్లా ఏటూరు నాగారం లకు కొత్త డిపోలు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో బస్ స్టేషన్ ల అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణాకు పెద్దపీట

వచ్చే రెండు సంవత్సరాల్లో నగరంలో 2800 ఇవి బస్సులు నడుస్తున్నాయని పూర్తి స్థాయిలో కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష ్యంగా ఈ బస్సులు వస్తున్నాయని చెప్పారు. బుధవారం ఇవి 65 బస్సులు వచ్చాయన్నారు. ఇప్పటికే 810 ఇవి బస్సులు హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లో నడుస్తున్నాయని తెలిపారు. వచ్చే జనవరి లో మరో 175 బస్సులు, వస్తున్నట్లు వెల్లడించారు. సెర్ఫ్ మహిళా శక్తి కింద మండల మహిళ సంఘాలకు 152 బస్సులు ఆర్టీసిలో ఉండగా త్వరలోనే 448 బస్సులు మహిళా సమైక్య సంఘాల నుండి రానున్నాయని తెలిపారు.

2047 విజన్లో సిఎం ఆలోచనలకు అనుగుణంగా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లో రవాణా శాఖ కీలక పాత్ర పోషించాలని తెలిపారు. దేశంలో అత్యున్నత సంస్థగా ఆర్టీసీ ఎదగాలని ఆశించారు. బస్ స్టేషన్ల ముందు ప్రైవేట్ వెహికిల్ లలో ప్రయాణికులను తరలిస్తే కేసులు బుక్ చేసి వాహనాలు సీజ్ అయ్యేలా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసీ పిల్లలు చదువుకోవడానికి ప్రత్యేకంగా ఆర్టీసీ స్కూల్ ఉండేలా ప్రభుత్వం తో మాట్లాడతానని తెలిపారు. సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు మునిశేఖర్, వెంకన్న, రాజశేఖర్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870