2024లో 54 మంది పైలట్లు డ్రంకన్రైవ్ పరీక్షల్లో ఫెయిల్.. ఒకరి డిస్మిస్
హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు(Road Accidents) పెరగడానికి మద్యం సేవించి వాహనాలు నడపడం ఒక కారణంగా పోలీసు, రవాణా శాఖ అధికారులు చెబుతుండడం తెలిసిందే. దీనిని సరిదిద్దేందుకు పోలీసులు తరచూ డ్రంకన్ డ్రైవ్ దాడులు చేస్తుండడం విదితమే. ఈ దాడుల్లో ఆ యా ప్రాంతాలలో వందల సంఖ్యలో మందు బాబులు పట్టుబడుతుండగా వీరిలో మొదటిసారిగా దొరికిపోయిన వారికి జరిమానాలు, రెండోసారి, మూడవసారి పట్టుబడ్డ వానికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు విధించడం, డ్రైవింగ్ లైసెన్స్(driving licence) లను కొన్ని నెలల నుంచి రెండు మూడేళ్ల పాటు లేదా శాశ్వతంగా రద్దు చేస్తుండడం జరుగుతోంది. రహదారులపై మందు బాబుల విషయం ఎలా వున్నా విమానాలు నడిపే పైలట్లలోనూ కొందరు మద్యం సేవించి విధులకు హాజరవడం, కొన్నిసార్లు ఏకంగా విమానాలు నడపడం వంటి ఘటనలూ వున్నాయి.
భారత్లోనూ పెరుగుతున్న విమాన ప్రమాదాలు
ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల కాలంలో విమానా ప్రమాదాలు పెరగగా ఇందులో భారత్లోనూ పెరగడం గమనార్హం. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొ న్ని నిమిషాలకే కూలిపోయి 241 మంది ప్రయాణీకులతో పాటు సమీపంలోని మెడికల్ కాలేజికి చెందిన 29 మంది మరణించడం సంచలనం రేపి ంది. ఈ ఘటనకు విమానంలోని రెండు ఇంజన్లకు ఇంధన సరఫరా క్షణాల వ్యవధిలో ఆగిపోవడం కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఇంధన సరఫరా చేసే స్విచ్లు వున్నట్లుండి ఆగిపోవడం ఇందుకు కారణంగా తేలింది. అయితే ఈ స్విచ్లను కో పైలట్ ఆపివేసినట్లు ప్రధాన ఫైలట్ భావించి, దీనిపై కో పైలట్ను అడగడం, తాను ఆఫ్ చేయలేదని ఆయన బదులివ్వడం, వెనువెంటనే క్షణాల్లోనే విమానం కూలిపోవడం జరిగింది. అయితే ఈ విమానంలోని ఇద్దరు పైలట్లు అనుభవం కలిగిన వారుగా, ఎలాంటి దురలవాట్లు లేనివారుగా పౌర విమానాయాన సంస్థ పేర్కొంది. ఈ విషయం అలావుంచితే గడచిన కొన్నేళ్లుగా ఇండియాలో విమానం నడిపే పైలట్లతో పాటు క్యాబిన్లో పనిచేసే ఇతర సిబ్బందిలో కొందరు మద్యం సేవించి విధులకు హాజరైనట్లు పౌర విమానాయాన సంస్థ పరిశీలనలో తేలింది. ఈ క్రమంలో ఒక పైలట్న ఉద్యోగం నుంచి డిస్మిస్ కూడా చేశారు.

724 విమానయాన సిబ్బంది బ్రీతింగ్ పరీక్షల్లో ఫెయిల్
2020 నుంచి 2024 మధ్య కాలంలో 724 విమానయాన సిబ్బంది బ్రీతింగ్ పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు పౌర విమానాయాన సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఇది తక్కువే అయినా అభివృద్ధి చెందుతున్న దేశంగా వున్న భారత్లో ఇప్పుడిప్పుడే విమానయాన రంగ O పురోగమనంలో వున్న తరుణంలో ఈ తరహా ఘటనలు ప్రయాణీకులపై ప్రతీకూల ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 2020లో 26 మంది పైలట్లు మద్యం తాగి
విధులకు హాజరు కాగా 2023లో ఈ సంఖ్య 33కు పెరిగింది. వీరితో పాటు 97 మంది క్యాబిన్ సిబ్బంది సైతం బ్రీతింగ్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. 2024లో ఈ సంఖ్య 54కు పెరిగింది. 2024 ఫిబ్రవరి నెలలో థాయ్లాండ్లోని.
మూడేళ్లు లైసెన్స్ సస్పెండ్
పుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం పైలట్ డ్రంకన్ డ్రైవ్ పరీక్షల్లో విఫలం అవడంతో ఎయిర్ ఇండియా సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జైపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన చార్టెడ్ విమానం పైలట్ కూడా బ్రీతింగ్ పరీక్షలో ఫె యిల్ అయ్యారు. పైలట్లు మద్యం తాగి విమానం నడిపినా అంతకు ముందు జరిగే బ్రీతింగ్ పరీక్షల్లో ఫెయిల్ అయినా మొదటిసారి మూడు నెల లు, రెండవసారి అయితే మూడేళ్లు లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. మూడవసారి అయితే శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తారు. విమానయాన సిబ్బంది తమ విధుల్లో నిక్కచ్చిగా వుండాలని పౌర విమాన యాన సంస్థ తరచూ హెచ్చరికలు జారీ చేస్తూనే వుంటుంది. ఇందులో మద్యం తాగి విధుల రావడం, మద్యం సేవించి విమానాలు నడపడం, విధుల్లో వుండడం వంటి విషయాలల్లో పౌరవిమానయాన సంస్థ పైల ట్లతోపాటు ఇతర సిబ్బందికి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని ప్రభుత్వ విమాన సంస్థలతో పాటు ప్రైవేటు ఎయిర్ లైన్స్ కూడా కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Congress Leader Murder: నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్య