పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెడ్డి
హైదరాబాద్ : గోదావరిలో మూడు వేల టిఎంసిల నీటి వరద ఉందని, ఆంధ్ర ప్రాజెక్టులు కట్టుకున్నా మనకు సమస్య లేదని, రాయల సీమను రతనాల సీమ చేస్తాను, బెసీన్లు లేవు, భేషజాలు లేవు అని కేసీఆర్ అంటేనే కదా ఈ రోజు వాళ్ళు బనకచర్ల, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు కడుతున్నదని టిపిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విమర్శించారు. గాంధీభవన్ లో విలేఖరులతో మాట్లాడుతూ హరీష్ రావు వాదనలలో పసలేదని ఢిల్లీలో నీటి పారుదల అంశాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సిఎం లు, నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారుల సమావేశంలో ఏ అంశాలపై ఏమీ మాట్లాడారో స్వయంగా కేంద్ర మంత్రి సి.ఆర్ పాటిల్ చెప్పిన కూడా హరీష్ రావు పిచ్చి వాగుడు వాగుతూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని దుయ్యబట్టారు.
సిఎం మాట్లాడగానే
మీటింగ్లో ఏయే అంశాలు, చెప్పినా కూడా హరీష్ ముఖ్యమంత్రి రేవంత్ రావు మెదడుకు ఎక్కనట్టు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు ఆరు అడుగులు పెరిగాడే తప్ప ఆర అంగుళం మెదడు పెంచుకోలేదు, అడ్డగోలు వాదన అర్థం లేని తర్కంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని విమర్శించారు. సిఎం మాట్లాడగానే ఏదో ఒకటి మాట్లాడి తన ఉనికిని చాటు కోవాలన్న తపన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షణ చేయాలనే తలంపు ఆయనలో ఏమాత్రంలేదని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రి హోదా లో మాజీ సిఎం, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ కు సవాల్ విసిరారని గుర్తుచేసుకున్నారు. అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనండి లేదా మేమే ఫామ్ హౌస్ కు వచ్చి అక్కడ మాక్ అసెంబ్లీ పెడుతాము మీరు పాల్గొనండి అని సవాల్ చేస్తే అక్కడ నుంచి నోరు లేవలేదని మీరు మళ్ళీ సిగ్గులేకుండా సవాళ్ల గురించి మాట్లాడుట్టున్నారు.

సవాల్ విసిరారు
తెలంగాణకు ఏమి అడ్డగోలుగా ద్రోహం చేసినా మీరే మళ్ళీ సిగ్గులేకుండా కాంగ్రెస్ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు. మీకు దమ్ముంటే అసెంబ్లీ లో పెట్టె చర్చలకు నువ్వు, మీ మామ కేసీఆర్ లు వచ్చి మీ వాదన చెప్పండని ఆయన సవాల్ విసిరారు. అప్పుడు ఎవరు ఏంటో తెలుస్తాది, ప్రెస్ మీట్ పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకుదామని చూస్తే జనం నమ్మరని హరీష్ రావు (Harish Rao) కు హితవు చెప్పారు. మాజీ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం. సత్యనారాయణ రావ్ సతీమణి సుగుణ మృతి బాధకరమని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తంచేశారు. ఎమ్మెస్సార్ సతీమణి సుగుణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుగుణ ఎమ్మెసార్ కుటుంబసభ్యులు బంధువులు మనోధైర్యం కోల్పోవద్దని ఆమె లేని లేటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తంచేశారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎవరు?
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణకు చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం, 2024 సెప్టెంబర్ 6 నుండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది?
మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ, యువజన కాంగ్రెస్‌లోనూ కీలక పాత్ర పోషించారు. ప్రజల సమస్యలపై గళమెత్తిన నాయకుడిగా ఆయన అభివృద్ధి చెందారు.
Read hindi news: hindi.vaartha.com