సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణలోని, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ (Parade Ground) లో జనవరి 13 నుంచి ఆరు రోజుల పాటు ‘ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్’ ఘనంగా నిర్వహించనున్నారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా డ్రోన్, హాట్ ఎయిర్ బెలూన్ షోలనూ ఏర్పాటు చేయనున్నారు. పతంగులతో పాటు డ్రోన్ షోలు, హాట్ ఎయిర్ బెలూన్ షోలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఫెస్టివల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చనున్నారు. జనవరి 13 నుంచి 15 వరకు కైట్ ఫెస్టివల్‌తో పాటు స్వీట్ ఫెస్టివల్ (Parade Ground)కూడా నిర్వహించనున్నారు.13,14 తేదీల్లో డ్రోన్, 16 నుంచి18 మధ్య హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్స్ జరుగుతాయని టూరిజం స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ పేర్కొన్నారు.
Read Also: LIG Flats: హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో ఎల్‌ఐజీ ఫ్లాట్ల విక్రయం ప్రారంభం

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: