కోర్టుల సూచనలను అనుసరించి పంచాయతీ ఎన్నికల్లో( Panchayat Polls) రిజర్వేషన్లు 50% లోపు మాత్రమే ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లు ఇవాళే సంబంధిత గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగం పందుకుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను ఎస్ఈసీకి పంపించింది.
Read Also: TG Elections: జీవో 46 అంటే ఏమిటి? బీసీ రిజర్వేషన్‌పై కొత్త చర్చ!

25న క్యాబినెట్ సమావేశంలో తేదీల ఖరారు?
స్థానిక సంస్థల ఎన్నికల( Panchayat Polls) తేదీలపై స్పష్టత ఈ నెల 25న జరిగే మంత్రివర్గ సమావేశంలో వచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్లు, నోటిఫికేషన్లు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం తేదీలను ఖరారు చేయడానికి సిద్ధమవుతోంది. దీంతో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్రంలో రాజకీయ ఉత్సుకత పెరిగింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: