రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల (Panchayat Elections 2025) పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. అయితే, పలుచోట్ల 1 గంట సమయానికే క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.(Panchayat Elections 2025) పోలింగ్ ముగియడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు.
Read Also: IMD forecast Hyderabad : హైదరాబాద్ వాతావరణం ఈ వారం అత్యంత చల్లని రోజులు ఇవే…

రాత్రికి ఫలితాలు వెల్లడించి, ఉప సర్పంచ్‌ల ఎన్నిక కూడా పూర్తి చేయనున్నారు.ముందుగా వార్డు మెంబర్స్ అభ్యర్థుల ఓట్లు కట్టలు కట్టి లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటాయి. ఊర్లలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే ఈ ఎన్నికకు భారీ బందోబస్తు కల్పిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: