తెలంగాణ నీటి ప్రాజెక్టుల నిర్వహణ మరియు పాలమూరు ప్రాంతానికి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా పదునైన విమర్శలు సంధించారు. కొడంగల్ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నీటి కష్టాలు తీరుతాయని ప్రజలందరూ ఆశించారని, కానీ కేసీఆర్ పదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేకపోయారని ఆరోపించారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని కావాల్సిన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రీ-డిజైనింగ్ పేరుతో కాలయాపన చేశారని మండిపడ్డారు.
CP Sajjanar: న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
పాలమూరు (మహబూబ్ నగర్) జిల్లా రాజకీయాలతో కేసీఆర్‌కు ఉన్న అనుబంధాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేసీఆర్ ఉమ్మడి జిల్లాకు వలస వచ్చి, ఇక్కడి ప్రజల మద్దతుతో ఎంపీగా గెలిచి, ఆపై ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. అయినప్పటికీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంలో ఆయన విఫలమయ్యారని ధ్వజమెత్తారు. పదేళ్ల కాలంలో పాలమూరు గడ్డ ఎండిపోవడానికి కేసీఆర్ అవలంబించిన అస్తవ్యస్తమైన జల నీతులే కారణమని ఆయన విశ్లేషించారు.

ప్రాజెక్టుల నిర్మాణం కంటే సొంత ఆస్తుల పెంపుపైనే గత పాలకులు దృష్టి సారించారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. “వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని లూటీ చేసి, ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారు కానీ, పేద రైతు పొలానికి నీళ్లు ఇవ్వలేదు” అంటూ నిప్పులు చెరిగారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి వల్లే ప్రాజెక్టుల వ్యయం పెరిగిందని, అయినా ఫలితం మాత్రం శూన్యమని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, పాలమూరు కన్నీళ్లు తుడుస్తామని రేవంత్ రెడ్డి ఈ సభ ద్వారా ప్రజలకు హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com