పిల్లల్ని స్కూలుకు పంపడం తల్లిదండ్రులకు ప్రాణసంకటంగా మారుతున్నది. తమ బిడ్డలు చక్కగా చదువుకోవాలని కుటుంబసభ్యులు లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి చదివిస్తున్నారు. వేలకు వేలుపెట్టి వాహనాల్లో స్కూళ్లకు పంపుతున్నారు. కానీ అవి తమ పిల్లల ప్రాణాలకు ఎంతవరకు భద్రతను ఇస్తాయి అని ఆలోచిస్తే భద్రత తక్కువే అని చెప్పాలి. ఈ వీడియో చూడండి ఏకంగా ఆటోలో 23మంది విద్యార్థులను ఓ ఆటో డ్రైవర్ తీసుకెళ్తున్న దృశ్యం.
Read Also: Health: జనపనార గింజలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

ఆటోను సీజ్ చేసిన పోలీసులు
నాగర్ కర్నూల్ (Nagar Kurnool) పట్టణ కేంద్రంలో ఒకే ఆటోలో 23మంది విద్యార్థులను తీసుకెళ్తున్నాడు ఓ ఆటోడ్రైవర్. దీంతో ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా ఆటోను ఆపారు. అందులోని పిల్లల్ని కిందకు దింపి లెక్కపెట్టారు. ఒకరు కాదు, పదిమంది కాదు ఏకంగా 23 మందిని కూర్చోబెట్టి, ప్రమాదకర స్థితిలో తీసుకెళ్తున్నాడు. దీంతో పోలీసులు ఆటోని పిల్లల్ని కిందకి దింప, ఆటోను (Over load auto) సీజ్ చేశారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతూ, వారి భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా నడిపే వాహనదారులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: