మ్యాన్ హోల్ (Man hole) ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యేకంగా వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై నీరు ప్రవహిస్తూ, మ్యాన్ హోల్ మూతలు తెరచుకుంటాయి. ఇలాంటప్పుడు అక్కడ మ్యాన్ హోల్ ఉందనే విషయం తెలియక కాలుపెడితే ఇక ప్రాణాలు పోవడమే. ఇలాంటి
ప్రమాదాలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. సరే వర్షాలు వచ్చినప్పుడు అంటే రోడ్లపై వచ్చే వరదనీటికీ అవి కనిపించవు,
మరి మరమ్మతుల (Repairs) పేరుతో మ్యాన్ హోల్ ను తెరచినప్పుడు వాటిపై మూతపెట్టకుండా అలాగే వదిలేస్తే ఈ తప్పు ఎవరిదని చెప్పాలి. మూతలేని ఓ మ్యాన్ హోల్ తెరచి ఉంచి, దానిపై ఎలాంటి హెచ్చరికలు లేకపోతే ప్రమాదం చోటుచేసుకుంటే ఎవరిని నిందించాలి? ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఓ చిన్నారి తెరచి ఉన్న మ్యాన్ హోల్ లో పడింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి..
ఓపెన్ డ్రెయిన్ లో పడ్డ చిన్నారి
యాకుతురాలోని పాతబస్తీ (Old City) లో ఓపెన్ డ్రెయిన్లో ఓ చిన్నారి పడిపోయింది. అదృష్టవశాత్తు అప్రమత్తం అయిన తల్లి తన బిడ్డను బయటకు తీసి, కాపాడుకుంది. పూడికతీత పనులు చేపట్టి పనిపూర్తి చేసుకున్న సిబ్బంది ఓపెన్ డ్రెయన్ (Drain) మూత పెట్టకుండా వెళ్లిపోయారు. ఇద్దరు చిన్నారులను స్కూలు నుంచి తీసుకొస్తున్న ఓ మహిళ ఒక పాప చేయి పట్టుకుని నడుస్తుండగా మరో పాప ముందు నడుస్తున్నది. ఆ చిన్నారి తన ముందు ఉన్నఓపెన్ డ్రెయిన్ను చూసుకోలేదు.
దీంతో ఆ బాలిక అందులో పడిపోయింది. వెనుకే వస్తున్న తల్లి వెంటనే అప్రమత్తమై తన చిన్నారిని గుంతలో నుండి వెలికి తీసింది. ఇంతలో ఇద్దరు మగవారు అక్కడికి చేరుకుని, అందుల్లో ఉన్న హెచ్చరిక జెండాను సరిగ్గా నిలబెట్టి వెళ్లారు. ఇదంతా సీసీ ఫుటేజ్లో రికార్డయింది. ఈ వీడియో వైరల్ గా మారింది. మ్యాన్ హోల్ మూత తీసింది మేం కాదని జలమండలి సిబ్బందే అంటూ ఒకరిపై ఒకరు నిందించుకోవడం కొసమెరుపు.
Read hindi news: hindi.vaartha.com
Read also: