हिन्दी | Epaper
తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Todays News : Indiramma Housing – ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అలసత్వం వద్దు

Shravan
Todays News : Indiramma Housing – ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అలసత్వం వద్దు

Indiramma Housing : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో అలసత్వం లేకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు (Minister Tummala Nageswara Rao) సూచించారు. బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నగరంలో నిర్వహించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజక వర్గ ఇంచార్జులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధి అజెండాగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇందిరమ్మ ఇళ్లు రహదారులు సాగునీటి ప్రాజెక్టులు విద్య వైద్య రంగాల్లో జరుగుతున్న అబివృద్ధి కార్యక్రమాల పురోగతి పై చర్చించారు. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైజింగ్ తెలం గాణ లక్ష్యంగా సాగుతున్న పాలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్లు నిబద్ధతతో నిజాయితీగా పని చేయాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై రైతు భరోసా రైతు రుణమాఫి పై బిఆర్ఎస్ బిజెపి నేతలు చేస్తున్న అసత్య ప్రచారం క్షేత్ర స్థాయిలో తిప్పి కొట్టాలని మంత్రి తుమ్మల తెలిపారు. సన్నబియ్యం పథకం మహిళలకు ఉచిత ఆర్టీసి బస్సు ప్రయాణం రైతు భరోసా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రభుత్వంపై ప్రజానీకం విశ్వాసంగా ఉన్నారని మంత్రి తుమ్మల తెలిపారు.

indiramma housing

అభివృద్ధి, పారదర్శక పాలనపై ఫోకస్ పెట్టాలి

పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు రహదారులు నిర్మాణంలో ఫోకస్ పెట్టాలని అన్ని వర్గాల వారికి పార్టీలకు అతీతంగా ప్రజా పాలనలో పారదర్శకంగా ఉండాలని మంత్రి తుమ్మల తెలిపారు. పత్తి వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతాంగం ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాలని అభివృద్ధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తనదైన ముద్ర వేయాలని మంత్రి తుమ్మల అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ బలోపేతం పై ప్రధాన దృష్టి పెట్టాలని, గత ప్రభుత్వ అరాచక అవినీతి కోటలు బద్దలు కొట్టి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేయాలని బిజెపి, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఎలా తెలంగాణ అభివృద్ధికి అడ్డు (Obstacle to development) పడుతు న్నారనే విషయాలపై పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి తుమ్మల దిశా నిర్దేశం చేశారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/roads-permanent-repairs-to-roads-and-bridges-damaged-by-rain/telangana/533806/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870