తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై మళ్లీ రాజకీయ చర్చ చెలరేగింది. మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హరీశ్ రావు, బనకచర్ల ప్రాజెక్ట్ DPR (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) పై కేంద్రం లేఖ పంపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించగా, ఉత్తమ్ కుమార్ ఆ ఆరోపణలను ఖండించారు. “హరీశ్ రావు అబద్ధాలు చెప్పి ప్రజా ప్రభుత్వాన్ని తప్పుగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు” అని మంత్రి మండిపడ్డారు.
Latest News: Andhra King Taluka Movie: ఆంధ్రా కింగ్ తాలూక టీజర్ వచ్చేసింది
ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించుతూ, నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని స్పష్టం చేశారు. “KCR పాలనలోనే తెలంగాణకు నీటి విషయంలో భారీ అన్యాయం జరిగింది. కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో గత ప్రభుత్వం విఫలమైంది,” అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ అన్యాయాన్ని సరిదిద్దే దిశగా కృషి చేస్తోందని తెలిపారు. కేంద్రంతో సమన్వయం సాధించి, రాష్ట్రానికి తగిన వాటా రావాలని కట్టుబడి ఉన్నామని చెప్పారు.

అలాగే మంత్రి వెల్లడించినదేమిటంటే, తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్‌కు కొత్త DPR సిద్ధం చేసి, అక్కడ బ్యారేజ్ నిర్మాణం చేపట్టే ప్రణాళిక కూడా రూపొందిస్తున్నామని అన్నారు. దీని ద్వారా ఉత్తర తెలంగాణకు తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టులపై విమర్శలు చేయడమే కాకుండా, సాంకేతిక, ఆర్థిక వాస్తవాలను అర్థం చేసుకోవాలని హరీశ్ రావుకు మంత్రి సూచించారు. తెలంగాణ ప్రజల నీటి హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/