వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్: భారతదేశపు సీడ్ హబ్ గా తెలంగాణ మారిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. హైదరాబాద్లో (Hyderabad) ద్లో నిర్వహించిన ఇండియా-ఆఫ్రికా సీడ్ సమ్మిట్-2025 లో మాట్లాడుతూ దేశ అవసరాల్లో 60 శాతం విత్తనాన్ని తెలంగాణ (Telangana) నుంచే సరఫరా చేయడమే కాకుండా, 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. వెయ్యికి పైగా విత్తన కంపెనీలు, ఆధునిక పరిశోధన, ప్రాసెసింగ్, నిల్వ సదుపాయాలతో పాటు కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల తెలంగాణ విత్తనాలకు గ్లోబల్ (Global) గుర్తింపు లభించిందని అన్నారు. అలాగే రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు భరోసాతో పాటు. రైతుల ఖాతాలో నేరుగా సబ్సిడీ జమ చేయడం ద్వారా వారు తమకు నచ్చిన నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు.

Telangana
ఈ వేదిక ఒక వారధిగా నిలుస్తుందన్నారు
ఈ విధానం ద్వారా పారదర్శకత పెరిగి, రైతును శక్తివంతంగా మార్చడానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఆఫ్రికా దేశాలు కూడా ఇలాంటి విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నాణ్యమైన విత్తనాల వినియోగం పెరిగి ఉత్పాదకత, ఆహార భద్రత గణనీయంగా మెరుగుపడుతుందని సూచించారు. ఇటువంటి సమ్మిట్ భారత్-ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయరంగంలో సంబంధాలను బలోపేతం చేసే వేదికగా ఈ సమ్మిట్ నిలుస్తోందని పేర్కొన్నారు. కేవలం వాణిజ్యంపై కాకుండా, సీడ్ డిప్లొమసీ ద్వారా విశ్వాసాన్ని పెంపొందించడం, శాస్త్ర పరిజ్ఞానం పంచుకోవడం, సుస్థిరమైన వ్యవసాయం (Agriculture) నకు భవిష్యత్తులో పరస్పరం కలిసి పనిచేయడం కోసం ఈ వేదిక ఒక వారధిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ (Indian) చాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఆఫ్రికన్ సీడ్ ట్రేడ్ అసోసియేషన్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Q1: తెలంగాణను ఏ పేరుతో పిలుస్తున్నారు?
A1: భారతదేశపు సీడ్ హబ్ (Seed Hub) గా పిలుస్తున్నారు.
Q2: తెలంగాణ నుంచి దేశ అవసరాల్లో ఎంత శాతం విత్తనాన్ని సరఫరా చేస్తున్నారు?
A2: దేశ అవసరాల్లో 60% విత్తనాన్ని తెలంగాణ నుంచే సరఫరా చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: