News Telugu: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించే అవకాశం కల్పిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అభిప్రాయపడ్డారు. ప్రజాభవన్‌లో జరిగిన కీలక సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజలకు చేరవేయాల్సిన సంక్షేమ పథకాలు
ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలను ప్రచారం చేయాలని ఆదేశించారు.
6 వేల కొత్త రేషన్ కార్డుల పంపిణీ
జూబ్లీహిల్స్‌లో ఇప్పటికే 6 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరు (New ration cards issued) చేశామని మంత్రి గుర్తు చేశారు. ప్రతి బూత్‌కి ఒక ఇంఛార్జ్‌ను నియమించి, స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించేలా ముందడుగు వేయాలని సూచించారు.
మౌలిక వసతులపై దృష్టి
నియోజకవర్గంలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ఎక్కడా ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు.
డివిజన్లలో కార్యాలయాల ప్రారంభం
నియోజకవర్గంలోని 7 డివిజన్లలో పార్టీ ఉపాధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్‌లు మరింత ప్రభావవంతంగా పనిచేయాలని మంత్రి కోరారు. ప్రతి డివిజన్‌లో ప్రత్యేక కార్యాలయాలను ప్రారంభించి ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపేలా చూడాలని సూచించారు.
పెండింగ్‌లో ఉన్న పథకాల పూర్తి
ఇందిరమ్మ ఇళ్లు సహా ఇతర పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన హితవు పలికారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: