తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీలో మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రస్తావించిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, రేవంత్ రెడ్డి సర్కార్‌పై కేటీఆర్ ధారాళంగా విరుచుకుపడ్డారు. కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ (Congress party) రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. “ఇప్పటి వరకు కాళేశ్వరాన్ని ‘కూలేశ్వరం’ అంటూ అపహాస్యం చేసిన వాళ్లే, ఇప్పుడు అదే ప్రాజెక్టు నీటితో హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చుతున్నామని చెప్పడం విడ్డూరంగా లేదూ?” అని ప్రశ్నించారు. ఈ విధమైన ప్రకటనలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు, కామధేనువు అని అంగీకరించినట్లేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఆరోపణలకు స్పందిస్తూ
ప్రాజెక్టు నిర్మాణంపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ కేటీఆర్,(KTR) “12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కాళేశ్వరం బ్యారేజీ చెక్కుచెదరలేదు. అయినా 20 నెలలుగా దానికి మరమ్మతులు ఎందుకు చేయలేదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు నిజాలను దాచిపెట్టి బీఆర్ఎస్‌పై బురద చల్లడమే పని చేసుకుంటోంది” అని అన్నారు. అలాగే గంధమల్ల రిజర్వాయర్ అంశాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్, “శంకుస్థాపన రోజే పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి పెద్ద మాటలు చెప్పారు. కానీ ఆ రిజర్వాయర్‌కు కూడా నీళ్లు రావాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానమైన కొండపోచమ్మ సాగర్ నుంచే. ఈ సత్యాన్ని ఎలా విస్మరిస్తారు?” అని ప్రశ్నించారు.

KTR
కేటీఆర్ విమర్శలతో
మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. “ఈ శంకుస్థాపనను మల్లన్న సాగర్ లేదా కొండపోచమ్మ సాగర్ వద్ద చేయాల్సింది. కానీ గుండెకాయ వదిలి గండిపేట వద్ద చేశారు. గండిపేటకు వస్తున్న నీళ్లు కూడా కాళేశ్వరం జలాలే కాదా?” అని నిలదీశారు. కేటీఆర్ విమర్శలతో కాళేశ్వరం అంశం మళ్లీ రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు పై అవినీతి ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు అదే నీళ్లను ఉపయోగించి హైదరాబాద్‌కు నీరు సరఫరా చేస్తున్నారని బీఆర్ఎస్ (BRS) ఎద్దేవా చేస్తోంది. దీంతో ప్రాజెక్టు చుట్టూ వాదోపవాదాలు మళ్లీ ముదురుతున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలు కేవలం కాంగ్రెస్‌పైనే కాకుండా, అసెంబ్లీలోనే మజ్లిస్ నేత ఒవైసీ చేసిన ప్రశ్నలను బలపరిచాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫలయత్నమా? లేక తెలంగాణ భవిష్యత్తు నీటి సమస్యలకు పరిష్కారమా? అనే చర్చలు మరోసారి వేడెక్కుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరిన్ని రాజకీయ మాటల దాడులు తప్పవని సూచనలు కనిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: