తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రమంగా పలు చర్యలు చేపడుతుంది. తాజాగా అదే దిశలో మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో ములుగు జిల్లాలో కొత్తగా ఒక క్రీడా పాఠశాల (Sports School) ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Read Also: TG High Court :మద్యం దుకాణాలు పెంచితే రాష్ట్రానికి కొత్తపేరు పెట్టాలి: హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది
ఈ మేరకు ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామంలో 40 ఎకరాల భూమిని కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీహరి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్‌లోని హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో క్రీడా పాఠశాలలు (Sports School) విజయవంతంగా కొనసాగుతున్నాయి.
ములుగులో ఏర్పాటు చేయనున్న ఈ కొత్త పాఠశాల రాష్ట్రంలో నాలుగో క్రీడా పాఠశాల కానుంది. గిరిజన ప్రాంతమైన ములుగులో ఈ పాఠశాల ఏర్పాటు కావడం వలన స్థానిక యువతకు, గిరిజన క్రీడాకారులకు అద్భుతమైన అవకాశం లభించినట్లవుతుంది. క్రీడా పాఠశాలలు కేవలం విద్యనందించడమే కాక, క్రీడాకారులకు ఉన్నత స్థాయి శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా రూపొందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: