Netflix: భాగ్యనగర ఐటీ మ్యాప్‌లోకి మరో అంతర్జాతీయ దిగ్గజం చేరింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం, వీఎఫ్‌ఎక్స్ (VFX) అండ్ వర్చువల్ ప్రొడక్షన్ హౌజ్ నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్ తన కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పనుంది. ఈ నెల 12న (మార్చి 12) తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి ఈ నూతన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
Read Also: Human trafficking : కూకట్‌పల్లిలో వ్యభిచార ముఠా అరెస్ట్
ముంబై తర్వాత రెండో ఆఫీస్.. విస్తరణలో నెట్‌ఫ్లిక్స్ మైలురాయి!
నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో అడుగుపెట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే ముంబైలో తన ప్రధాన కార్యాలయం ఉండగా, ఇప్పుడు హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నది దేశంలోనే రెండో కార్యాలయం. దాదాపు 30,000 నుండి 41,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో (హైటెక్ సిటీ ప్రాంతంలో) ఈ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నారు.

ఇది కేవలం ఓటీటీ నిర్వహణ మాత్రమే కాకుండా, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ప్రొడక్షన్ పనులకు వేదిక కానుంది.ఈ విస్తరణతో హైదరాబాద్ నగరం గేమింగ్ అండ్ కామిక్స్ (ఏవీజీసీ ), యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ రంగం మరింత పటిష్ఠం కానుందని సర్కార్ భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: