రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద
హైదరాబాద్ (బేగంపేట) : మహిళా కమిషన్ ఎల్లప్పుడూ మహిళలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద(Nerella Sarada) అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో తెలంగాణ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘నారీ న్యాయ్ హియర్ హర్ ఔట్’ అనే బహిరంగ విచారణ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా నుంచి ఉద్యోగ, గృహ హింస వేధింపులు, వివక్ష, ఆర్ధిక, సైబర్ క్రైమ్ తదితర సమస్యలకు సంబంధించి మహిళా బాధిత ఫిర్యాదులను స్వీకరించారు.
Read Also: TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగిన విచారణలో 49 మంది మహిళలు సమర్పించిన ఫిర్యాదులను ఛైర్పర్సన్ నేరెళ్ల శారద అదనపు కలెక్టర్ కదిరవన్ పలని, ఉమెన్ సేఫ్టీ డిసీపీలు డా. లావణ్య, టి.ఉషారాణి జిల్లా రెవెన్యూ అధికారి ఇ.వెంకటాచారి బాధితుల సమస్యలు విని తగిన పరిష్కారాలు సూచిస్తూ సంబంధిత శాఖల నుంచి చర్యలు పెండింగ్ ఫిర్యాదులపై నివేదికలు కోరారు.
అధిక శాతం ఫిర్యాదులు గృహ హింస(Domestic violence)పై అందాయని, ఎక్కువ ఫిర్యాదుల్లో నిందితులు ఎన్ఆర్ఎలుగా ఉండటం వల్ల ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసికెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మహిళా కమీషన్ కార్యదర్శి పద్మజా రమణ, సభ్యులు షాహిన్ అఫ్రోజ్, ఈశ్వరీబాయి, శుద్ధం లక్ష్మి, గద్దల పద్మ, కొమ్ము ఉమాదేవి యాదవ్, ఏ. రేవతిరావు(Revathi Rao), జిల్లా సంక్షేమ శాఖాధికారులు వివిధ జోన్ల పోలీసు అధికారులు, సఖి నిర్వహకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: