రాష్ట్రంలోని చేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(Nellikanti Sathyam) కోరారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం నాయకులతో కలిసి శుక్రవారం చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ను హైదరాబాదులోని కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మీనరసయ్యతో కలిసి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ… రాష్ట్రంలో సుమారు లక్ష కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, సంక్షోభంలో కోరుకపోయిన చేనేత రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also: Red Sandalwood: ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకున్న గ్రామస్తులు
చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలను, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.1 లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తున్నట్టు 14 నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని, రూ. 33 కోట్లు రుణమాఫీ కోసం విడుదల చేస్తున్నామని వెల్లడించారని గుర్తు చేశారు. చేనేత కార్మికుల రుణ బకాయిల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నందున సరిపడినన్ని నిధులను విడుదల చేసి రైతన్నల మాదిరిగా నేతన్నలను రుణ విముక్తులను చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 527 చేనేత సహకార సంఘాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. టెస్కో కొనుగోలు చేసిన వస్త్రాలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో వడ్డీల భారం పెరిగి చేనేత సహకార సంఘాలు అప్పుల్లో కూరుకపోయాయని, వడ్డీల భారం పెరిగి చాలా చేనేత జౌళి శాఖ కమిషనర్కు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విజప్తి కమిషనర్ సంఘాలు మూతపడడంతో కార్మికులకు ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు.
Nellikanti Sathyam: చేనేత సహకార సంఘాల రుణాలన్నింటినీ మాఫ్ చేసి, బ్యాంకుల ద్వారా కొత్తగా రుణ సహాయం అందించి, మూతబడిన సంఘాలన్నింటినీ తెరిపించాలని కోరారు. సహకార చట్టం ప్రకారం చేనేత సహకార సంఘాలకు 2013లో ఎన్నికల నిర్వహించారని, 2018తో వాటి కాలపరిమితి ముగిసినా ఇప్పటివరకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. చేనేత సహకార సంఘాల సమాఖ్య “టెస్కో” కు సైతం పాలకవర్గం లేనందున చేనేతల సంక్షేమం పట్టించుకునేవారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ సత్యం తెలిపారు. కమిషనర్ని కలిసిన వారిలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాషికంటి లక్ష్మి నరసయ్య, గౌరవాధ్యక్షుడు వెంకట్ రాములు, అధ్యక్షుడు పెండెం సర్వేశ్వర్, నాయకులు జల్లీ రాములు, కస్తూరి బిక్షపతి, కర్నాటి మారయ్య, సురపల్లి జనార్ధన్, దుడుక ఉప్పలయ్య ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: