Narsingi crime : నార్సింగి మండలం శంకాపూర్ అటవీ ప్రాంతంలో విషాదం. చిన్న కొడుకు 20 రోజుల క్రితం చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వృద్ధురాలు(85) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్సింగి మండలం శంకాపూర్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
Read Also: Nakkapalli Steel Plant : నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కు డేట్ ఫిక్స్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామయంపేట మండలం జాన్సీ లింగాపూర్ కు చెందిన శాలిపేట రుక్కమ్మ భర్త సిద్దయ్య చిన్న కొడుకు చనిపోవడంతో మనస్థాపానికి గురై రెండు రోజుల నుంచి ఇంటి నుంచి వెళ్లిపోయి శుక్రవారం అటవీ ప్రాంతంలో మృత దేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలు శాలిపేట రుక్కమ్మకు నలుగురు కొడుకులు ఒక బిడ్డ కాగా ముగ్గురు కుమారులు చనిపోయారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :