हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Nandyala road accident : నంద్యాల రోడ్డు ప్రమాదం నలుగురు హైదరాబాద్ వాసులు మృతి

Sai Kiran
Nandyala road accident : నంద్యాల రోడ్డు ప్రమాదం నలుగురు హైదరాబాద్ వాసులు మృతి

Nandyala road accident : నంద్యాల జిల్లా లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.

ఈ దుర్ఘటన ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల–బత్తలూరు గ్రామాల మధ్యగా ఉన్న 40వ నంబర్ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆరుగురు ప్రయాణిస్తున్న కారు తిరుపతి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా, తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో డ్రైవర్ కంటిమీద కునుకు రావడంతో వాహనంపై అదుపు కోల్పోయాడు.

దీంతో కారు రోడ్డు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద తీవ్రత కారణంగా కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

Read also: Water Board: హైదరాబాద్‌లో నీటి సరఫరాకు 36 గంటల అంతరాయం

ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే (Nandyala road accident) ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కుకుపోయిన మృతదేహాలను మరియు క్షతగాత్రులను ఎంతో శ్రమించి బయటకు తీసి, గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్నవారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

ప్రమాద స్థలాన్ని కె. ప్రమోద్ కుమార్ (ఆళ్లగడ్డ డీఎస్పీ) పరిశీలించారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా తెల్లవారుజామున డ్రైవర్ల అలసట, నిద్రమత్తు కారణంగా ఇలాంటి దుర్ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం

అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం

రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

కార్మికుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

కార్మికుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

సంక్రాంతి సెలవుల అనంతరం మేడారంలో భక్తుల రద్దీ

సంక్రాంతి సెలవుల అనంతరం మేడారంలో భక్తుల రద్దీ

శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

సికింద్రాబాద్ అస్తిత్వం ప్రమాదంలోనా? తలసాని సంచలన వ్యాఖ్యలు!

సికింద్రాబాద్ అస్తిత్వం ప్రమాదంలోనా? తలసాని సంచలన వ్యాఖ్యలు!

అమల్లోకి నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్

అమల్లోకి నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్

హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్ స్టార్ట్! హైదరాబాద్‌లో రైడ్ ధర ఎంత?

హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్ స్టార్ట్! హైదరాబాద్‌లో రైడ్ ధర ఎంత?

త్వరలోనే మిగిలిన రెండు గ్యారెంటీలు అమలు: అడ్లూరి లక్ష్మణ్

త్వరలోనే మిగిలిన రెండు గ్యారెంటీలు అమలు: అడ్లూరి లక్ష్మణ్

ములుగు జిల్లా రద్దుపై సీతక్క క్లారిటీ

ములుగు జిల్లా రద్దుపై సీతక్క క్లారిటీ

మేడారం ఆలయాన్ని 19న పునఃప్రారంభించనున్న సీఎం

మేడారం ఆలయాన్ని 19న పునఃప్రారంభించనున్న సీఎం

శీతాకాలం తగ్గుముఖం.. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదల

శీతాకాలం తగ్గుముఖం.. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870