Free bus travel scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల తెలంగాణ ఆర్టీసీ ఆదాయపరంగా గణనీయమైన పురోగతి సాధిస్తోందని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి(Nagireddy) తెలిపారు. ఈ పథకం మహిళలపై ఉన్న ప్రయాణ ఖర్చు భారాన్ని తగ్గించడమే కాకుండా, ఆర్టీసీకి ప్రయాణికుల సంఖ్యను భారీగా పెంచిందని ఆయన అన్నారు.
Read Also: Highway Project: ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ వరకు 18.5 కిమీ కారిడార్ నిర్మాణం
250 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు.. రూ.8,500 కోట్ల ఖర్చు ఆదా
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 10 వేల బస్సులు నడుస్తుండగా, దాదాపు 60 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేస్తున్నట్లు తెలిపారు. వీరిలో సుమారు 45 లక్షల మంది మహిళలేనని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 250 కోట్లకు పైగా మహిళా ప్రయాణాలు నమోదయ్యాయని నాగిరెడ్డి వెల్లడించారు. ఈ పథకం అమలుతో మహిళలు మొత్తం రూ.8,500 కోట్ల వరకు ప్రయాణ వ్యయాన్ని ఆదా చేసుకున్నారని తెలిపారు. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతో దోహదపడుతోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

భద్రాచలం ఆర్టీసీ డిపోను సందర్శించిన నాగిరెడ్డి, అక్కడ చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, మొక్కల నాటకాన్ని ప్రశంసించారు. అనంతరం బస్సుల పరిస్థితిని పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరచేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని చెప్పారు.
హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణ
రాబోయే రెండు సంవత్సరాలలో 2,000 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు, వాటిలో ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 800కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు(Electric buses) అందుబాటులో ఉన్నాయని, రాబోయే మూడు సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం మొత్తం ఎలక్ట్రిక్ బస్సులతో నడిచేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ సేవలను విస్తరిస్తామని స్పష్టం చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని, అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తోందని నాగిరెడ్డి అన్నారు. ఈ పథకం అమలుతో ఆర్టీసీ లాభాల దిశగా ముందుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: