Urea Mobile App: రాష్ట్రంలో యూరియా సరఫరాలో పారదర్శకత తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. యూరియా కొనుగోళ్ల కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Nageswara Rao) ప్రకటించారు. అక్రమంగా యూరియా బ్లాక్ మార్కెట్‌కు లేదా పరిశ్రమలకు తరలిపోకుండా నేరుగా రైతులకే చేరేలా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
Read Also: KTR news : హామీ సర్పంచులపై వేధింపులపై బీఆర్‌ఎస్…
‘కపాస్ కిసాన్’ యాప్
ఈ విషయాన్ని మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో మంత్రి వెల్లడించారు. పత్తి విక్రయాల కోసం తీసుకువచ్చిన ‘కపాస్ కిసాన్’ యాప్ రైతుల నుంచి మంచి స్పందన పొందిందని, అదే తరహాలో యూరియా యాప్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. యాప్ రూపకల్పనకు ముందే రైతు వేదికల ద్వారా రైతుల అభిప్రాయాలు సేకరించామని, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని మంత్రి పేర్కొన్నారు.

యూరియా కొనుగోళ్లలో స్లాట్ బుకింగ్(Slot booking) వంటి ప్రక్రియల్లో రైతులకు సహాయం చేసేందుకు రైతు వేదికల వద్ద వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) అందుబాటులో ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. అయితే ఈ అంశంపై కొందరు రాజకీయ లాభాల కోసం అనవసర విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు భరోసా కోసం యూరియా కొనుగోళ్లు సులభం
అదే సమయంలో పంటల సర్వే ప్రక్రియను మరింత ఖచ్చితంగా చేయడానికి శాటిలైట్ టెక్నాలజీ (Satellite technology) వినియోగంపై జర్మనీకి చెందిన ఓ సంస్థతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే, వాస్తవంగా సాగు చేసిన భూమికే ‘రైతు భరోసా’ పథకం ప్రయోజనం అందే అవకాశం ఉంటుందని వివరించారు.
సాగు చేయని కొండలు, గుట్టలు వంటి భూములకు రైతు భరోసా నిలిపివేసి, ఆ నిధులను ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు మళ్లిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనలపై త్వరలోనే కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: