రాష్ట్రంలో యూరియా కొరత అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామాలు ఆడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.రాష్ట్రంలో సరిపోయేంత యూరియా (Urea) ఉందని, రైతులు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు యూరియాను అందుబాటులో ఉంచామన్నారు.

రైతులు యూరియా కోసం వేచిచూడడం లేదు
కాగా రాష్ట్రంలో యూరియూ కొరత ఉందని, తద్వారా రైతులు (Farmers) వాటికోసం పడిగాపులు కాస్తున్నారని అసత్యప్రచారాలను చేస్తున్నారని తుమ్మల మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, అందులో ఎలాంటి రాజీ లేదని అన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కృషి చేస్తున్నది గుర్తు చేశారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం కోసం తాపత్రయపడుతున్నదని, ఇందులో భాగంగా అసత్యాలను మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల ఘాటువ్యాఖ్యలు చేశారు
తుమ్మల నాగేశ్వరరావు ఎవరు?
ఆయన భారత రాజకీయ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ పదవులు భరిస్తూ అనుభవాన్ని సంపాదించారు. 1953 నవంబర్ 15న జన్మించారు.
ఆయన రాజకీయ వృత్తి ప్రారంభం ఎప్పుడు?
ఆయన 1982లో తెలుగుదేశం పార్టీ (TDP)తో రాజకీయ ప్రయాణం ప్రారంభించారు.
Read also: hindi.vaartha.com
Read also: