హైదరాబాద్: నాగార్జునసాగర్ (Nagarjuna sagar) జలాశయ స్పిల్ వే ప్రాంతం వద్ద తరచూ ఏర్పడుతున్న గుంతలను శాశ్వత ప్రాతిపదికన పూడ్చడం కోసం రూర్కీ ఐఐటి నిపుణులు, ఎంవైకే, ఫాస్టాక్ నిపుణుల సౌజన్యంతో అధు నాతన పద్దతిలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

స్పిల్వేపై గోతులు
ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జునసాగర్లో 2014కు పూర్వం కురిసిన భారీ వర్షాల కారణంగా ఆరున్నరమీటర్ల లోతు కంటే ఎక్కువ గోతులు స్పిల్వేపై ఏర్పడినాయి. ఆనాటి నుంచి ప్రతియేడు గుంతలు పడటం రివాజుగా మారింది. గుంతల మరమ్మతు చేస్తూ ఉన్నా ప్రస్తుతం మీటరుకు లోతుకు మించి గోతులు స్పిల్వేపైలేవు. గుంతల పరిశీలనకు ప్రత్యేక క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని కెఆర్ఎంబి అనుమతితో తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదలశాఖకు అనుమతి ఇచ్చింది నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్వే వద్ద ఎంవైకే, ఫాస్టాక్ నిపుణుల కమిటీ బృందం బుధవారం పరిశీలించారు. వీరి నివేదికలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు నీటిపారుదల శాఖ నిపుణులు కార్యచరణ చేపట్టనున్నారు. నాగార్జునసాగర్ లోకి గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా అదనంగా వచ్చిన నీటిని ఆనకట్ట క్రస్టుగేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తారు. ఆ నీరు వెళ్లడం కోసమే స్సిల్వేను నిర్మించారు. 585 అడుగుల వరకు నిల్వ చేస్తూ ఆదనంగా వస్తున్న నీటిని ఆధారంగా చేసుకొని దీనిద్వారా వదులుతారు. సుమారు 600 అడుగుల ఎత్తు నుంచి ఒత్తిడితో వస్తున్న నీటి ఉదృతి కారణంగా గుంతలు పడుతుంటాయి. ఆరువదుల చరిత్ర కలిగిన ఆనకట్టులో అత్యంత కీలకమైన స్పిల్వే మరమ్మతుల నిర్వహణ ప్రతి యేడు గోతులుపడి ఉభయరాష్ట్రాలకు అనిశ్చితి కలిగిస్తున్నది.
అధిక వరదల వల్ల 6 మీటర్ల లోతు వరకు గుంతలు
2014 కంటే ముందు వచ్చిన భారీ వరదనీటి కారణంగా పెద్ద గుంతలు పడడంతో ప్రభుత్వం రూ.40 కోట్లతో మరమ్మతులు చేశారు. కొంతకాలం బాగానే ఉన్నా మళ్లీ అధిక వరదల వల్ల 6 మీటర్ల లోతు వరకు గుంతలు ఏర్పడ్డాయి. దీంతో 2023 -24లో రూ.19 కోట్లతో మరమ్మతులు చేయగా 2024లో జలాశయంలో నీరు గరిష్ఠ స్థాయికి చేరడంతో నీటిని విడుదల చేయడంతో మళ్ళీ గోతులు పడ్డాయి. ప్రస్తుతం మీటరులోతులోపే గోతులు స్పిల్వేపై ఉన్నాయి ఇలాగే వదిలేస్తే మరల వరదనీరు అధికమై స్పిల్వే దెబ్బతినే ప్రమాదం ఉందని నీటిపారుదలశాఖ అధికారులు అనిశ్చితికి గురవతున్నారు. ఎంవైకే, ఫాస్టాక్ నిపుణుల కమిటీ బృందం అధ్యయనం చేసే కంటే ముందు కూడా గతంలో అనేక ఏజన్సీలు అధ్యయనం చేశాయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాలుగా విభజనతరువాత ఎన్ఎస్పి నిర్వహణ బాధ్యత తెలంగాణకు ఇచ్చారు. కెఆర్ఎంబి బోర్డు ప్రాజెక్టు మరమ్మతులను తెలంగాణకు అప్పగించడంతో క్రస్ట్ గేట్లకు రూ.10లక్షల నిధులు వెచ్చించి ఇప్పటికే పనులు చేస్తున్నారు. 26 గేట్లలో 22 గేట్లకు సంబంధించిన పనులు పూర్తికాగా జూన్ 12న మొదటిసారి ట్రయల్ రన్ నిర్వహించారు. ఇంకా నాలుగు క్రస్ట్ గేట్లకు మరమ్మతులు చేసి జూన్ 20లోగా మరోసారి ట్రయల్ రన్ చేయను న్నారు. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వే గుంతలపై రూర్కీ ఐఐటీ నిపుణులతో అధ్యయనం చేయించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదేశాల అనుగుణంగా నీటి పారుదలశాఖ అధ్యయనం చేయించారు. మార్చిలో రూర్కీ నిపుణులు ప్రాధమిక నివేదిక రూపొం దించారు. జూన్ మొదటి వారంలోనూ వీరు తాత్కాలికంగా మార్పులు చేర్పులు చేసి స్పిల్వేకు మరమ్మతులు ఎలా చేయాలో సూచనలు జారీ చేశారు. అయితే నీటిపారుదల అధికారులు మాత్రం మరమ్మతు పనులు తాత్కాలిక ప్రాతి పదికన కాకుండా శాశ్వతంగా నిలిచేలా నివేదికలు రూపొందించాలని చెప్పడంతో వీరి అధ్యయనం ఇంకా కొనసాగుతోంది.
Read also: Nita Ambani : బల్కంపేట అమ్మవారికి నీతా అంబానీ కోటి రూపాయల విరాళం