హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి(G. Kishan Reddy), రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, బిజెపి తమిళ నాడు, కర్ణాటక ఇంచార్జ్ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో చరిత్రాత్మక పోలీస్ యాక్షన్
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు, నాడు ఆగస్టు అనేకమంది ప్రాణాలు బలితీసుకున్నారు. బైరాన్ హైదరాబాద్ సంస్థానంలో 1948 సెప్టెంబర్ 17 వరకు స్వాతంత్రం రాలేదన్నారు. ఆ రోజు ఆపరేషన్ పోలో ద్వారా నియంత నిజాంకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వంలో హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) నేతృత్వంలో చరిత్రాత్మక పోలీస్ యాక్షన్ ద్వారా తెలంగాణను భారతదేశంలో అంతర్భాగంగా చేసుకోవడం జరిగిందని, ఈ విజయం వెనుక అనేక మంది త్యాగాలు ఉన్నాయన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి, కాసిం రజ్వీ ఏర్పాటు చేసిన రజాకార్ల సైన్యం హైదరాబాద్ సంస్థానంలో అనేకమంది అమాయకులను వేధించారు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టారన్నారు. పల్లి, పరకాల, గుండ్రాంపల్లి, నిర్మల్ వంటి అనేక ప్రదేశాల్లో రజాకార్లు మహిళలపై వేధింపులు జరిగాయి. దాడులు చేశారు. రజాకార్లపై ఈ ప్రాంతాల్లో అనేకమంది పోరాటం చేశారు. ఈ చరిత్ర మనందరికీ గుర్తుగా నిలిచిపోవాలని, అప్పుడు జరిగిన సంఘటనలు మనం ఎప్పటికీ మరచిపోకూడదని అన్నారు.
తెలంగాణ లిబరేషన్ డే ని అధికారికంగా జరుపుకోవాలని
మనం గుర్తించు కోవాల్సింది ఏమిటంటే నియంత నిజాం వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం, హైదరాబాద్ స్టేట్ అప్పట్లో మన ప్రజలు నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి, స్మరించుకోదగిన త్యాగాలు చేశారని అన్నారు. గత 25 సంవత్సరాలుగా మన భారతీయ జనతా పార్టీ ఆ పోరాటయోధులను స్మరించుకునేలా, తెలంగాణ లిబరేషన్ డే ని అధికారికంగా జరుపుకోవాలని నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ప్రతి ఏడాది 17 సెప్టెంబర్ రోజును తెలంగాణ ప్రజల హృదయాలను కదిలించే, గౌరవింపదగిన దినంగా గుర్తించాలని, సర్దార్ వల్లభాయి పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా పోలీస్ యాక్షన్ సిన కీలక పాత్ర లేకపోతే, ఈ ప్రాంతం పాకిస్తాన్ లేదా మరో స్వతంత్ర దేశంగా ఉండే పరిస్థితి ఏర్పడేడని పోరాటయోధుల అన్నారు. త్యాగాన్ని మర్చిపోకుండా, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమో చన దినోత్సవాన్ని అధికారికంగా జరువు కోవాలన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రేరణతో హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారని, మన భారత సైనిక, కేంద్ర బలగాలు సైతం ఈ సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను గత మూడు సంవత్సరాలుగా నిర్వహించుకోవడం. జరుగు తుందన్నారు. నరేంద్ర మోడీ నాయ కత్వంలో, అవినీతి రహిత, సుపరిపాలనతో భారత్ దేశం వికసిత్ భారత్ గా ఎదుగుతుందని, ఈ రోజు విశ్వకర్మ దినోత్సవం కావడంతో, దేశ నిర్మాణం కోసం కృషి చేస్తున్న శ్రామికుల సేవలను గుర్తు చేసుకుంటూ, విశ్వకర్మ మహర్షిని స్మరించుకోవాలన్నారు. ఇన్ని కార్యక్రమాల మధ్య కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విజయ వంతంగా జరుపుకునేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ముందుకొచ్చి భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: