సంస్థాన్నారాయణపురం (నల్గొండ) : మునుగోడు (Munugode) ప్రాంత ప్రజల అభివృద్దే తన ధ్యేయమని, అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే నని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. సంస్థాన్ నారా యణపురం మండలం లచ్చమ్మగూడెంలో నూతనంగా నిర్మించిన 33/11 సబ్ స్టేషనను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల కోసం నాడు పదవీ త్యాగం చేసి ప్రభుత్వాన్నే మునుగోడు ప్రాంత ప్రజల కాళ్ల ముందు నిలబెట్టానని, పదవులు తనకు ముఖ్యం కాదని, ఈ ప్రాంత అభివృద్దే ధ్యేయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పడంతోనే తాను తిరిగి పార్టీలోకి వచ్చానని, పదవుల కోసం ఎవ్వరి కాళ్ల వద్దకు వెళ్లలేనన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకో వాలన్నరు. గత ప్రభుత్వంలో నియోజవకర్గం మొత్తం సమస్యలకు నిలయంగా మారిందని, తాను ఎమ్మెల్యే అయిన తర్వాత సమస్యలపై దృష్టి సారించి ప్రధాన సమస్యలైన విద్యా, వైద్యం, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందన్నారు. నియోజక వర్గంలో మరో 19 సబ్ స్టేషన్ల నిర్మాణం కోసం ప్రతిపాధనలను సిద్ధం చేశామన్నారు. దీంతో లోఓల్టేజి సమస్య లకు పరిష్కారం లభిస్తుందన్నారు. మరో రెండు 132 కెవి సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడంతో నియోజవకర్గం లో పూర్తిగా విద్యుత్ సమస్య పరిష్కారమౌ తుందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడానికి కమ్యూనిస్టులు కీలకమని, అదే విధంగా కమ్యూనిస్టులకు ఎమ్మెల్సీ రావడం కాంగ్రెస్ పార్టీ పాత్ర అంతేనన్నారు. అనకు తడుగా ఎమ్మెల్సీ సత్యం తోడుగా ఉన్నాడని, ఇద్దరం కలిసి మునుగోడు అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.

ఎల్బి. నగర్ నుంచి పోటీ చేస్తే తనకు మంత్రి పదవి వచ్చేదని, కానీ మునుగోడు ప్రజల అభివృద్ధి (People development) కోసమే ఇక్కడికి వచ్చావన్చారు. మునుగోడు ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని, మొదటి విడతలో ప్రభుత్వ నిబంధనలతో అందరికి ఇండ్లు రాలేదని, అర్హులందరికీ ఇళ్లు ఇప్పిస్తామన్నారు. బిఆర్ఎస్లో ఒక్క ఇళ్లు కూడా రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజవకర్గంలో 3500 ఇండ్లు మంజూరు అయ్యాయన్నారు.. అనంతరం చిమిర్యాల గ్రామంలో సబ్స్టేషన్ నిర్మాణం కోసం శంకుస్థావన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాన్రెడ్డి, ఆర్డిఓ శేఖర్రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిడిఓ ప్రమోద్ కుమార్ తదితరులున్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :