మొంథా తుపాను బాధితులకు(montha cyclone) తెలంగాణ ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం మంజూరు చేసింది. దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు కూ.12.99 కోట్లను విడుదల చేసింది. 15 జిల్లాలోని 8,662 ఇళ్లకు రూ.15వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అధికారులు బాధిత కుటుంబాలకు అందించనున్నారు. తెలంగాణలో(Telangana) మొంథా తుపాను కారణంగా ఆయా జిల్లాల్లో జరిగిన నష్టంపై ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే.
Read also: అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత

రైతులకు రూ.10వేలు
వివిధ జిల్లాల్లో(montha cyclone) జరిగిన పంట నష్టంతో పాటు, రహదారులు, నీటి వనరులు, పశువులు, ప్రానష్టంతో పాటు ఇతర పాథమిక వివరాలను పూర్తిగా పంపాలని సీఎస్ రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో అధికారులు కసరత్తు ప్రారంభించి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణసాయం కింద రూ.12,99 కోట్లను మంజూరు చేసింది. తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు, మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం రేవత్ రెడ్డి వరంగల్ పర్యటనలో ప్రకటించారు. నీట మునిగిన ఇంటికి రూ.15వేలు, నిర్వాసితులైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: